ఏప్రిల్ 10 నుంచి అన్నవరం షూటింగ్
పవన్ కళ్యాణ్ అన్నవరం రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 10న అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభం కానుంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఏప్రిల్ 31 వరకు జరగనుంది. తమిళంలో సూపర్‌హిట్ అయిన తిరుపాచికి ఇది రీమేక్. భీమినేని శ్రీనివాసఎఆవు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆసిన్ హీరోయిన్. ప్రేమిస్తే ఫేం సంధ్య పవన్‌కళ్యాణ్ చెల్లెలుగా నటించనుంది. సంగీతం రమణ గోగుల. ఈ సినిమా ముహుర్తం షాట్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో డిసెంబర్ 15న చిత్రీకరించారు. సినిమా ప్రారంభానికి చిరంజీవి, వెంకటేష్ ముఖ్య అతిధులుగా విచ్చేశారు. పవన్ కళ్యాణ్ బంగారం తర్వాత ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications