పవన్, బాలకృష్ణ సినిమాలు ఒకేరోజు?
పవన్ కళ్యాణ్ బంగారం, బాలకృష్ణ వీరభద్ర ఒకే సమయంలో విడుదల కానున్నాయి. దీనితో ఉభయుల అభిమానుల్లో, ట్రేడ్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. బంగారం ఆడియో గురువారం విడుదలైంది. ఈ సినిమా ఏప్రిల్ 22న విడుదల కానుంది. బాలయ్య వీరభద్ర కూడా అదే రోజు విడుదల అవుతుంది. ఈ రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్‌లతో నెలల తరబడి షూటింగ్ జరుపుకున్నాయి. వీరభద్ర సినిమాను అంబికా కృష్ణ నిర్మించారు. సదా, తనూశ్రీ దత్తా హీరోయిన్లు. ఈ సినిమా ఆడియో నేడు విడుదల కానుంది. ఇక పవన్ బంగారం హైలైట్స్ అన్నీ ఇన్నీ కావు. భారీ నిర్మాత ఎఎం రత్నం ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











