పవన్ కు ఆయన రెండుసార్లు లైఫిచ్చారా!

ఎంతటి ఘనవిజయాన్ని సాధించాయో అందరికీ తెలిసిందే. ఇందులో పవన్ కళ్యాణ్ సినిమా సుస్వాగతం సినిమా కూడా ఉంది. ఈ సినిమా నుంచే పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక గుర్తింపును సాధించిపెట్టింది. ఆ తరువాత వచ్చిన అన్నవరం సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించనప్పటికీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. సుస్వాగతం సినిమాకు ముందే పవన్ కళ్యాణ్ గోకులంలో సీత సినిమాతోనే తన సత్తాను నిరూపించుకున్నప్పటికీ సుస్వాగతం సినిమా ఆయన స్థానాన్ని సుస్థితరం చేసిందని చెప్పవచ్చు. విచిత్రమేమంటే పవన్ కళ్యాణ్ తో భీమనేని తీసిన రెండు సినిమాలు తమిళ రీమేక్ లే కావడం ఇక్కడ విశేషం. తొలి సినిమా సుస్వాగతంతో మిత్రులైన ఇద్దరిలో పవన్ కళ్యాణే అన్నవరం సినిమాకు భీమనేనికి అవకాశం ఇచ్చాడు. ఇదంతా ఎందుకు చెప్పాల్సివస్తోందంటే భీమనేని పేరిట ఉన్న www.bheemanenicinema.com లో ఉన్న వార్తలో పవన్ కు రెండు సినిమాల అవకాశం ఇచ్చి భీమనేని ఆయనకు లైఫ్ ఇచ్చాడని ఉంది. మొదటి కొంచెం కరెక్ట్ అయినా రెండవ సినిమా అన్నవరం సినిమా విషయంలో పవన్ కళ్యాణే భీమనేనికి అవకాశం ఇచ్చాడని విశ్లేషకులు అనుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇపుడు అందులో రాయాల్సిన అవసరం ఏమొచ్చిందని పవన్ కళ్యాణ్ అభిమానులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











