శ్రీజ పెళ్లితో సినిమాలకు అంతరాయం?
శ్రీజ రహస్య పెళ్లి వ్యవహారం చిరంజీవి కుటుంబ సభ్యులను బాగానే డిస్ట్రబ్ చేసినట్టు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ చిరుత విడుదలయిన కొద్దిరోజులకే శ్రీజ వ్యవహారం జరగడంతో కుటుంబం అంతా తీవ్ర షాక్ కు గురయింది. ఈ షాక్ నుంచి ఇంకా ఆ కుటుంబం బయటకు రాలేకపోతోంది. దీనితో పవన్ కళ్యాణ్ సినిమా జల్సా షూటింగ్ కు అంతరాయం కలిగినట్టు సమాచారం. చిరంజీవి, రామ్ చరణ్ కు ప్రస్తుతం సినిమాలు లేవు కానీ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ సినిమాకు కూడా అంతరాయం ఏర్పడినట్టు ఫిల్మ్ నగర్ సమాచారం.


Click it and Unblock the Notifications











