పవన్‌తో మేం కలిసే ఉన్నాం : అల్లు అర్జున్

By Bojja Kumar

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా కుటుంబంతో విడిపోయారు అని రెండు మూడు రోజులుగా మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలను అల్లు అర్జన్ ఖండించారు. వాటిలో నిజం లేదని...తామంతా పవన్ కళ్యాణ్ తో కలిసే ఉన్నామని, ఆయన ఒంటరి కాదని బుధవారం మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు.

పంజా ఆడియో సమయంలో చిరంజీవి ఢిల్లీలో ఉన్నారని, రామ్ చరణ్ చైనాలో ఉన్నారని, తాను షూటింగు నుంచి తిరి వచ్చేసరికి లేటైందని...అందుకే ఆ ఫంక్షన్ కు హారు కాలేక పోయామని అల్లు అర్జున్ వివరణ ఇచ్చారు. అన్ని ఫంక్షన్ లకు అందరూ రావడం వీలు కాదని, ఒక ఫంక్షన్ కు రానంత మాత్రాన అలా రాసేస్తారా? అంటూ మీడియా తీరుపై అర్జున్ అసహనం వ్యక్తం చేశారు. మీడియా కథనాలు తనను చాలా బాధించాయని చెప్పకొచ్చారు.

ఇటీవల జరిగిన పంజా ఆడియో వేడుకకు మెగా కుటుంబం నుంచి ఎవరూ హాజరు కాక పోవడానికి తోడు, తనకు అన్నయ్య వారసత్వం అవసరం లేదని పవన్ సంచలన వ్యాఖ్యలు చేయడంతో.....మెగా కుటుంబంతో పవన్ విడిపోయారనే ఊహాగానాలకు కారణమైంది. అయితే ఈ వార్తలపై పవన్ కళ్యాణ్ స్పందించక పోవడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X