పవన్ బంగారం దాదాపు పూర్తి
శ్రీ సూర్య మూవీస్ బ్యానర్‌పై పవన్ కళ్యాణ్ హీరోగా ధరణి దర్శకత్వంలో రూపొందుతున్న బంగారం సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఈనెల 14 నుంచి 19 వరకు అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఒక పాటను చిత్రీకరించారు. ఈ పాటకు బాలీవుడ్‌కి చెందిన సబీనా ఖాన్ నృత్య దర్శకత్వం వహించారు. ఈనెల 27 వరకు షూటింగ్ నిరాఘాటంగా జరుగుతుందని నిర్మాత ఎఎం రత్నం చెప్పారు. ఆదిత్యా మ్యూజిక్ ద్వారా ఆడియో మార్చి మొదటి వారంలో విడుదల అవుతుంది. సినిమాను మార్చి నెలాఖరులో విడుదల చేయనున్నారు. సమాంతరంగా డబ్బింగ్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరాచోప్రా, రీమాసేన్ హీరోయిన్లు. రాజా, అశుతోష్ రాణా, ముఖేష్ రుషి, తనికెళ్ళ భరణి, అలీ, వేణుమాధవ్, సంతోషిణి, కవితాశ్రీ తదితరులు ఇతర తారాగణం. సంగీతం విద్యాసాగర్, కెమెరా గోపీనాథ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ధరణి.


Click it and Unblock the Notifications