కర్నాటక, ఒరిస్సాలకు సి.ఎమ్.పి.ఎఫ్!!!!
పవన్ కళ్యాణ్ ప్రారంభించిన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ (సి.ఎమ్.పి.ఎఫ్)రాష్ట్ర సరిహద్దులను దాటుతోంది. ఇప్పటికే సంచలనం సృష్టిస్తున్న సి.ఎమ్.పి.ఎఫ్ పక్క రాష్ట్రాలకు పాకుతోంది. ఒరిస్సా, కర్నాటక రాష్ట్రాలకు దీని ప్రభావం పాకింది. ఆయా రాష్ట్రాలలో ఉన్న వివిధ ఎన్.జి.వో సంస్థలతో సి.ఎమ్.పి.ఎఫ్ సంప్రదిస్తున్నట్టు సమాచారం. రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేకుండా కలకాలం నిలిచిపోవాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో సి.ఎమ్.పి.ఎఫ్ ఇతర రాష్ట్రాలకు వ్యాపించడం నిజంగా సంచలనమే.
సామాన్యుడికి తన ప్రాథమిక హక్కులను తెలియజెప్పడంతో పాటు సమాజంలో నెలకొన్న అవినీతి తదితర జాడ్యాల పట్ల ప్రజలను జాగృతం చేయడం, సమాచారం హక్కు చట్టం విలువను తెలిసేలా చేయడం సి.ఎమ్.పి.ఎఫ్ ప్రధానంగా చేపట్టనున్నట్టు తెలుస్తోంది. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ, చె గువేరా తదితరులు ఇచ్చిన స్ఫూర్తి కూడా సి.ఎమ్.పి.ఎఫ్ ఏర్పాటుకు కారణమని ఇంతకుముందే పవన్ కళ్యాణ్ చెప్పాడు.


Click it and Unblock the Notifications











