త్రివిక్రమ్ డైరెక్షన్‌లో పవన్
దర్శకుడిగా మారిన స్టార్ రైటర్ త్రివిక్రమ్ తాజాగా పవన్ కల్యాణ్ హీరోగా ఒక సినిమా రూపొందిస్తున్నారు. కథలు చెప్పి హీరోలని ఒప్పించడంలో సిద్ధహస్తుడైన త్రివిక్రమ్ ఈసారి పవన్ కల్యాణ్‌కు ఎటువంటి సబ్జెక్ట్ చెప్పి ఉంటారన్న ఆసక్తి పరిశ్రమవర్గాల్లో నెలకొంది. త్రివిక్రమ్ మొదటి సినిమా నువ్వే నువ్వే అంతంతమాత్రంగా ఆడినా.. ఆ తరువాత మహేశ్‌బాబు హీరోగా అతడు చిత్రాన్ని రూపొందించారు. బడ్జెట్ విపరీతంగా పెరిగిపోవడం వల్ల వసూళ్లు ఎంతవచ్చినా ఆ సినిమా ప్రొడ్యూసర్‌కు పెద్దగా లాభాలు ఆర్జించిపెట్టలేదు. అయితే, అతడు చిత్రం అప్పటికే ఇబ్బందుల్లో ఉన్న మహేశ్‌బాబు కెరీర్‌కు కొంత ప్లస్ అయింది. అదే విధంగా ప్రస్తుతం కష్టదశలో ఉన్న హీరో పవన్ కల్యాణ్‌ను కూడా త్రివిక్రమ్ తమ తాజా చిత్రంతో గట్టెక్కిస్తారా లేదా వేచి చూడాలి.
ఈ సినిమా ఓకె అయ్యాక పవన్ కల్యాణ్ తన సొంత డైరెక్షన్‌లో మొదలుపెట్టదలచిన సత్యాగ్రహి చిత్రాన్ని వాయిదా వేసుకున్నారు. అలాగే మహేశ్‌బాబుతో త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఎం.ఎస్.రాజు నిర్మించే హరే రామ హరే కృష్ణ చిత్రం కూడా వాయిదా పడింది.
పవన్ కల్యాణ్ ప్రస్తుతం అన్నవరం చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అక్టోబర్ 31 వరకూ ఏకధాటిగా సాగే అన్నవరం షూటింగ్ అనంతరం నవంబర్ చివరి వారంలో త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తీయబోయే సినిమాలో పాల్గొంటారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications