పవన్‌కళ్యాణ్ సత్యాగ్రహి వెబ్‌సైట్
తాను నటించి దర్శకత్వం వహించబోతున్న హిందీ-తెలుగు చిత్రం సత్యాగ్రహి వెబ్‌సైట్‌ను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఆ సినిమా ప్రారంభోత్సవం నాటికే ఈ సైట్ సిద్ధమైంది. తన గత సినిమాల ప్రారంభోత్సవాలను నిరాడంబరంగా జరిపిన పవన్ కళ్యాణ్ సత్యాగ్రహిని మాత్రం భారీ ఎత్తున నిర్వహించారు. ఎప్పటికప్పుడు టెక్నికల్‌గా అప్‌డేటెడ్‌గా ఉండే పవన్ ఈ సినిమాకు ప్రత్యేకంగా ఒక సైట్ ఉండాల్సిన అవసరాన్ని గుర్తించినట్టు కనిపిస్తోంది. వెబ్‌సైట్ కోసం కృషి చేసిన తన టీం సభ్యులను ఆయన అభినందించారు. ఈ సినిమా తన డ్రీమ్ ప్రాజెక్టు అని, తాను సమాజానికి ఏ చెప్పదలచుకున్నానో అవన్నీ ఇందులో ఉంటాయని ఆయన చెప్పారు. కాగా ఈ సినిమాకు గాను పవన్ నిర్మాత ఎఎం రత్నంకు బల్క్ డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సమాజాన్ని జాగృతం చేసే ఎన్నో సినిమాలు తీసిన ఎఎం రత్నం మాత్రమే ఇటువంటి సినిమాను నిర్మించగలరన్న ఉద్దేశంతోనే తాను కథను ఆయనకు మాత్రమే చెప్పినట్టు పవన్ వెల్లడించారు.
పవన్ సత్యాగ్రహి వెబ్‌సైట్ లింక్: www.pawankalyansatyagrahi.com


Click it and Unblock the Notifications