పవన్ తో సూర్య పత్రిక అధినేత సినిమా?
సూర్యపత్రిక అధినేత నూకారపు సూర్యప్రకాష్ రావు, పవన్ కల్యాణ్ హీరోగా సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న జల్సా సినిమాలో చేస్తున్నాడు. అందుకే పవన్ కల్యాణ్ ఇటీవల విడుదల అయిన భీమ సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భీమ సినిమా తెలుగులో నూకారపు నిర్మిస్తున్నారు. తమిళంలో ఎంఎమ్ రత్నం శ్రీ సూర్యా మూవీస్ పతాకంపై భీమ సినిమా నిర్మిస్తున్నారు. రత్నం వద్ద డబ్బులు లేక సినిమా ఆగిపోవడంతో నూకారపు రంగప్రవేశం చేసి సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డట్టు సమాచారం. నూకారపు గతంలో అదిరిందయ్యా చంద్రం, బ్రహ్మాస్త్రం సినిమాలు నిర్మించాడు.


Click it and Unblock the Notifications











