అవునూ..పవన్ ఏమయ్యాడు
మెగా ఫ్యామిలీ మొత్తం వరద బాధితులను ఆదుకోవటానికి ఫండ్స్ రైజ్ చేసే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం యువరాజ్యం అధ్యక్ష్యుడు హోదాలో గానీ, కామన్ మేన్ ప్రొటక్షన్స్ ఫోర్స్ వ్యవస్ధాపకుడుగాగానీ ఏమీ చేయటం లేదని అంతటా వినపడుతోంది. రామ్ చరణ్ సైతం పది లక్షలు ప్రకటించి తన దాతృత్వాన్ని ప్రకటించిన నేపధ్యంలో పవన్ పాత్ర ఏమిటనేది పార్టీ వర్గాల్లోనే కాక పరిశ్రమలోనూ చర్చనీయాంశమైంది. మరోప్రక్క పులి చిత్రం హడావిడిలో ఉన్నాడని శ్రేయాభిలాషులు సర్ధిచెపుతున్నారు. ఇక నాగబాబు కూడా ఈ వరదల విషయంలో స్పందిచకపోవటం కూడా పవన్ తో పాటే టాపిక్ వస్తోంది. అయితే ఇలా అన్నదమ్ములు ఇద్దరూ సైలెంట్ గా ఉండటం మాత్రం పద్దతి కాదని అభిమానులు సైతం అంటున్నారు. ఏమో వారి మనస్సుల్లో ఏముందో తెలియాలంటే వారు మౌనం వీడి మీడియా ముందుకు రావాలి.
More from Filmibeat
పవన్ కళ్యాణ్ పులి వరదలు యువరాజ్యం నాగబాబు కామన్ మ్యాన్ ప్రొటక్షన్ పోర్స్ ఎస్.జె.సూర్య జల్సా pavankalyan puli sjsurya flood nagababu chiranjeevi prp commonmanprotection yuvarajyam


Click it and Unblock the Notifications











