రెమ్యునరేషన్ విషయంలో పవన్ కళ్యాణ్ తెలివైన నిర్ణయం.. ఇలాగైతే వందల కోట్లు దాటినట్లే..

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాంటి సినిమా చేసినా కూడా స్పెషల్ గా ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి సినిమా చేసినా కూడా మినిమమ్ వసూళ్లు అందుకుంటాయి. జస్ట్ యావరేజ్ అన్నా కూడా ఇండస్ట్రీలో కొత్త రికార్డులు నమోదవుతుంటాయి. అంతగా మార్కెట్ సంపాదించుకున్న పవర్ స్టార్ చాలా కాలం తరువాత వరుసగా నాలుగు సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఇక రెమ్యునరేషన్ టాపిక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

 ఆ విషయమే నిర్మాతలకు బాగా తెలుసు

ఆ విషయమే నిర్మాతలకు బాగా తెలుసు

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అత్యదిక రెమ్యునరేషన్ అందుకునే స్టార్ హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకరని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆయన సినిమాలు చాలా వరకు ఫెయిల్ అయినప్పటికీ పవన్ తో గనక మంచి సినిమా తీస్తే త్రిబుల్ ప్రాఫిట్స్ అందుకోవచ్చని నిర్మాతలకు బాగా తెలుసు. అందుకే నిర్మాత దిల్ రాజు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాడు. ఫైనల్ గా వకీల్ సాబ్ సినిమాతో ఆయన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

 ఆ విధంగా డీల్ సెట్ చేసుకుంటే..

ఆ విధంగా డీల్ సెట్ చేసుకుంటే..

అయితే ఇటీవల కాలంలో అగ్ర హీరోల రెమ్యునరేషన్ ని తట్టుకోవడం అనేది నిర్మాతల్లో కొంత ఆందోళన కలిగిస్తోంది. ఇక ఇటీవల కాలంలో వచ్చిన కొత్త ఫార్మాట్ కొంత వరకు లాభదాయకమనే చెప్పాలి. సినిమా బిజినెస్ లో డైరెక్ట్ గా షేర్ తీసుకుంటే ఏ బాధ ఉండదని ఒక కొత్త ఆలోచనను తీసుకువచ్చారు. ప్రస్తుతం బాలీవుడ్ లో చాలా మంది అదే ఫార్మాట్ లో వెళుతున్నారు. తెలుగులో మహేష్ కూడా అలానే చేస్తున్నాడు.

 ఆ సినిమా కోసం 50% షేర్స్

ఆ సినిమా కోసం 50% షేర్స్

ఇక పవన్ కల్యాణ్ కూడా వకీల్ సాబ్ సినిమాకు కూడా బిజినెస్ లో షేర్స్ అందుకోవాలని చూస్తున్నాడు. దాదాపు 50శాతం షేర్స్ తీసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ లెక్కన చూస్తే పవన్ కళ్యాణ్ మరో మూడు సినిమాలను కూడా లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే కొందరి నిర్మతల వద్ద అప్పులు అడ్వాన్స్ తీసుకున్నట్లు సమాచారం.

Recommended Video

Pawan Kalyan, Chiranjeevi, Bandla Ganesh Green India Challenge
 అలా చేస్తే పవన్ ఖాతాలో 200కోట్లు

అలా చేస్తే పవన్ ఖాతాలో 200కోట్లు

క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న పిరియడిక్ మూవీ, అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవర్ స్టార్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయనున్నాడు. ఇలా నాలుగు సినిమాలతో సిద్ధం కానున్న పవన్ సినిమాలకు మంచి బిజినెస్ సెట్టయితే దాదాపు 200కోట్ల ఆదాయాన్ని అందుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X