twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్యాన్స్ కోసం పవన్ కళ్యాణ్‌ కొత్త తరహాగా....

    By Srikanya
    |

    పవన్ ఫ్యాన్స్ ఏమి కోరుకుంటున్నారో అవన్నీ ఈ చిత్రంలో వుంటాయి. కళ్యాణ్ బాబు కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందించటం ఓ ఎత్తైతే, ఫ్యాన్స్ కోసం కళ్యాణ్‌బాబు కొత్త తరహాగా కనిపించటానికి, కొత్తదనాన్ని అందించటానికి శ్రమించటం మరో ఎత్తని చెప్పాలి అంటున్నారు గణేష్ బాబు. పవన్‌కల్యాణ్, త్రిష కాంబినేషన్ లో కమిడెయిన్ గణేష్‌బాబు నిర్మిస్తున్న చిత్రం కాశీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

    ఈ చిత్రం గురించి నిర్మాత గణేష్‌బాబు మాట్లాడుతూ "ఇటీవలే కల్యాణ్‌బాబు నటిస్తున్న ప్రొడక్షన్ నెం.1 చిత్రం షూటింగ్ కాశీలో అత్యంత భారీగా జరిగింది.ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. షూటింగ్ రెగ్యులర్‌గా ఎక్కడా ఆటంకం లేకుండా జరగటానికి ముఖ్య కారకులు మా హీరో పవన్‌కల్యాణ్. షూటింగ్‌లో ఆయన సహకారం మరువలేనిది. దర్శకుడు జయంత్ తన గత చిత్రాలను మించి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. మాటలతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసే క్రియేటివ్ రైటర్ అండ్ డైనమిక్ దర్శకుడు కూడా అయిన త్రివిక్రమ్ ఈ చిత్రానికి పూర్తి స్క్రిప్ట్‌ని అందించారు.

    లవ్, ఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్... ఇలా అన్ని కమర్షియల్ హంగులు ఈ చిత్రంలో ఉంటాయి. తదుపరి షెడ్యూల్‌ని నవంబర్ రెండో వారంలో న్యూజిలాండ్‌లో 40 రోజుల పాటు చేస్తాం అన్నారు, లవ్ ఆజ్ కల్ రీమేక్ గా పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై నిర్మాణమవుతున్న ఈ చిత్రానికి జయంత్.సి.పరాన్జి దర్శకత్వం వహిస్తున్నారు. త్రిష, కృతి హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని బడే రవికిరణ్ సమర్పిస్తున్నారు. మాటలు: త్రివిక్రమ్, కళ: నారాయణరెడ్డి, కెమెరా: జైనన్ విన్సెంట్, సహ నిర్మాత: శివబాబు, నిర్మాత: గణేష్‌బాబు, దర్శకత్వం: జయంత్.సి.పరాన్జి

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X