పవన్ కళ్యాణ్ సినిమా జల్సా షూటింగ్ మళ్లీ ప్రారంభం అయింది. తండ్రి వెంకట్రావు అస్థికలను స్వయంగా పవన్ కళ్యాణ్ నెల్లూరు పట్టణం సమీపంలో పెన్న నదిలో కలిపారు. అనంతరం ఆయన షూటింగ్ లో పాల్గొంటున్నారు. జనవరి 4నుంచి చిత్ర హీరోయిన్ ఇలియానా షూటింగ్ లో పాల్గొంటుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు దేవి శ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Story first published: Sunday, June 28, 2026, 13:16 [IST]