అల్లు అర్జున్‌కు కోచ్‌గా పవన్ కళ్యాణ్!
తన మేనల్లుడు అయిన అల్లు అర్జున్‌కు పవన్ కళ్యాణ్ కోచ్‌గా వ్యవహరించనున్నట్టు తెలిసింది. తన కెరియరే సరిగా లేని పవన్ అర్జున్‌కు నటనలో, ఇతర విషయాల్లో పాఠాలు ఎలా చెబుతారని ఎవరైనా అనుకోవచ్చు. కానీ ఎన్ని పరాజయాలు ఎదురైనా పవన్‌కు యువతరంలో సూపర్‌స్టార్‌డం ఉంది. అల్లు అర్జున్ ఇటీవల పవన్‌కు ప్లీజ్ గైడ్ మి అని ఒక ఎస్‌ఎంఎస్ పంపాడట. అది చూసుకున్న పవన్ తనపై అంత నమ్మకం ఉంచినందుకు ఆనందిస్తూ కొన్ని విషయాల్లో గైడ్ చేస్తానని జవాబుగా ఎస్‌ఎంఎస్ పంపాడట. ఇంత సన్నిహిత బంధువులు ముఖాముఖి మాట్లాడుకోకుండా ఈ ఎస్‌ఎంఎస్‌లు ఏమిటా అన్న ప్రశ్న తలెత్తవచ్చు. మొహమాటపడకుండా ఆధునిక టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతోందో చూడండి. మార్షల్ ఆర్ట్స్ విషయంలో అల్లు అర్జున్ ప్రధానంగా పవన్ కళ్యాణ్ గైడెన్స్ తీసుకోనున్నట్టు తెలిసింది. త్వరలో తెరమీదికి రానున్న తన అన్నగారి కుమార్ రామ్‌చరణ్ తేజకు కూడా పవన్ కోచింగ్ ఇవ్వాల్సి ఉంటుందేమో.


Click it and Unblock the Notifications