లోక్ సత్తా, సి.ఎమ్.పి.ఎఫ్ కలిసి పనిచేస్తాయా?
పవన్ కళ్యాణ్ లోక్ సత్తా పార్టీతో మిలాకత్ అయినట్టు ఫిల్మ్ నగర్ లో పుకార్లు గుప్పుమంటున్నాయి. తాను ప్రారంభించిన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ (సి.ఎమ్.పి.ఎఫ్)ఉద్ధేశాలు, లోక్ సత్తా ఉద్ధేశాలు ఒకటే కావడం, ఈ రెండు సంస్థలు అవినీతికి వ్యతిరేకంగా పోరాడడం, సామాన్య మానవుడి జీవన ప్రమాణాలు పెంచడమే కావడమే ఇందుకు నిదర్శనమని అనుకుంటున్నారు. ఇసిఐఎల్ లోని రాధిక థియేటర్ లో జరిగిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ కు పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా రావడం, ఇదే కార్యక్రమానికి లోక్ సత్తా కన్వీనర్ డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ కూడా హాజరయ్యారు. ఇద్దరూ ఒకే మాదిరిగా మాట్లాడారు కూడా. పవన్ కళ్యాణ్ తీరు చూస్తుంటే చిరంజీవి పార్టీ పెట్టకపోతే పవన్ కళ్యాణే లోక్ సత్తాతో కలిసి పనిచేసేట్టు ఉన్నాడని ఫిల్మ్ నగర్ సమాచారం.


Click it and Unblock the Notifications











