పవన్ చాలా డీసెంట్:ఇలియానా
పవన్ కళ్యాణ్ చాలా డీసెంట్ అని ఇలియానా సర్టిఫికెట్ ఇచ్చింది. జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా చేస్తున్న ఇలియానా పవన్ కళ్యాణ్ పై పొగడ్తల వర్షం కురిపించింది. తెలుగులో తనతో నటించిన హీరోలలో పవన్ కళ్యాణ్ అంత డీసెంట్ హీరోని తాను చూడలేదని చెబుతోంది. జల్సా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ తనను కొట్టాడని వచ్చిన వార్తలను చూసి షాక్ అయ్యాను అంటోంది. సెట్ లో పవన్ తనతో మాట్లాడిందే చాలా తక్కువ ఆయన పనేదో ఆయన చూసుకుంటారు. అసలు అంత డీసెంట్ గైపై ఎలా ఈ పుకారు పుట్టించారో వారికే తెలియాలి. ఒక వార్త రాసేముందు నిజానిజాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇలియానా అంది.


Click it and Unblock the Notifications











