సంక్రాంతి నుంచి పవన్ పులి!
ప్రస్తుతం జల్సాగా తిరుగుతున్న పవన్ కళ్యాణ్ కొద్ది రోజులలో సీరియస్ కానున్నాడు. పులిగా మారనున్నాడు. కొద్ది రోజులలో జల్సా షూటింగ్ ముగియనున్న నేపథ్యంలో సంక్రాంతికి పులి వేషం వేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నాడు. పులికి దర్శకత్వం వహించడానికి ఎస్.జె.సూర్య రెడీగా ఉన్నట్టు సమాచారం. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఖుషీ సినిమా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కు సూట్ అయ్యే స్క్రిప్ట్ ను సూర్య సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ చిత్రం షూటింగ్ జనవరి 16 నుంచి ప్రారంభం కానున్నది. సింగమల రమేష్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నాడు.


Click it and Unblock the Notifications











