పవన్ 'గబ్బర్ సింగ్' లేటెస్ట్ ఇన్ఫో
పవన్ కళ్యాణ్ హీరోగా హిందీలో హిట్టైన 'దబాంగ్' చిత్రాన్ని తెలుగులో 'గబ్బర్‌సింగ్'గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్‌కల్యాణ్, శ్రుతిహాసన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 25 నుంచి హైదరాబాద్‌లో మొదలవుతుంది . ఈ చిత్రానికి కొత్త పోస్టర్ ని ఈ మద్యనే విడుదల చేసారు. ఈ చిత్రంలో పొగరుమోతు పోలీసు అధికారి గా పవన్ కనిపించనున్నారు. చాలా కేర్ లెస్ గా కనిపించే మాస్ లుక్ తో ఉన్న క్యారెక్టర్ ని ప్రతిబింబించేలా ఈ స్క్రిప్టుని ని రూపొందించారు.
ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో దర్శక,నిర్మాతలు ఉన్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. 'మిరపకాయ్" వంటి మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు హరీష్‌శంకర్ 'గబ్బర్‌సింగ్" చిత్రాన్ని, పెద్ద హిట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు"" అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: హరీష్‌శంకర్. పవన్‌కళ్యాణ్‌తో 'తీన్‌మార్" వంటి భారీ చిత్రాన్ని నిర్మించిన గణేష్‌బాబు ఈ 'గబ్బర్‌సింగ్" చిత్రాన్ని నిర్మించటంతో మంచి క్రేజ్ ఏర్పడుతుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











