twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మళ్ళీ మెగా ఫోన్ పట్టనున్న పవన్ ?

    By Staff
    |

    Pawan Kalyan
    'జాని' ఘోర పరాజయం తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ యాక్షన్ కట్ చెప్పటానికి ప్రిపేర్ అవుతున్నాడని తెలుస్తోంది. ఆ సినిమా మరేదో కాదుట. 'బంగారం' నిర్మాణ సమయంలోనే లాంఛనంగా ప్రారంభమైన 'సత్యాగ్రహి'. అప్పట్లో శ్రీ సూర్యా మూవీస్ అధినేత ఎ.ఎం. రత్నం ఈ సినిమాను నిర్మించాలనుకున్నారు. అయితే ఆ తర్వాత వరస ఫ్లాపులతో రత్నం నిండా నష్టాల్లో కూరుకు పోవడంతో ఆయన 'సత్యాగ్రహి'ని నిర్మంచలేనని పవన్‌కు తేల్చి చెప్పేశారు. కానీ పవన్ కి ఆప్రాజెక్టు పై ఆసక్తి తగ్గలేదు. దాదాపు రెండేళ్ల తర్వాత నూకారపు సూర్య ప్రకాశరావు రూపంలో పవన్‌కు నిర్మాత లభించాడు. అలాగే 'సత్యాగ్రహి'ని పవన్ దర్శకత్వంలోనే నిర్మించేందుకు నూకారపు ఆనందంగా అంగీకరించారని తెలుస్తోంది.

    దాంతో ఒకవైపు 'పులి' కోసం పవన్ సిద్ధమవుతూనే, మరోవైపు 'సత్యాగ్రహి' స్క్రిప్టును తన రచయితల బృందంతో కలిసి తయారు చేస్తున్నాడు . ఇప్పటికి ఆ స్క్రిప్ట్ 75 శాతం దాకా పూర్తయిందని అంటున్నారు. అర్జెంటీనా విప్లవ యోధుడు చేగువేరాని అమితంగా ఆరాధించే పవన్, ఆయన స్ఫూర్తితో ఈ కథను రూపొందిస్తున్నాడు. అన్నీ అనుకూలిస్తే ఈ సినిమా 2009 జనవరిలో సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలున్నాయి. పూర్తవటానికి ఒక యేడాది గ్యారింటీగా పడుతుంది. అంటే పవన్ దర్శకత్వంలో తయారయ్యే సినిమా చూడాలంటే మనం మరో రెండేళ్ళు ఆగాలి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X