ఒకే రకం అవుట్ ఫిట్ లో త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్(ఫోటో)
హైదరాబాద్: పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ చిత్రం షూటింగ్ లో ఇద్దరూ ఇలా ఒకేరకమైన అవుట్ ఫిట్స్ వేసుకుని ఉషారుగా ఉన్నారు. ఇక ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని ఉదాగిరోజున అంటే ఏప్రియల్ 11 న విడుదల చేయటానికి నిర్ణయించినట్లు సమాచారం. గతంలో గబ్బర్ సింగ్ చిత్రం ఫస్ట్ లుక్ ని శివరాత్రి రోజు విడుదల చేసారు. అదే పద్దతిని ఈ చిత్రానికి కూడా పాటించనున్నారు.
ఇక ఉగాది రోజు ఈ చిత్రంలో పవన్ ఎలా ఉంటారో తెలుస్తుంది. అలాగే...టైటిల్ ఏంటనే సస్పెన్స్ వీడుతుంది. ఇక ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో రూ. 3 కోట్ల ఖర్చుతో సెట్ వేసారు. ఆర్ట్ డైరెక్టర్ రవీంద్ర పర్యవేక్షణలో ఈ ఖరీదైన సెట్ వేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా చేస్తున్నారు. ఈచిత్రంలో పవర్ స్టార్ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడని, అతని క్యారెక్టరైజేషన్ కూల్ గా, హాస్య భరితంగా ఉంటుందని అంటుందని ఫిల్మ్ నగర్ టాక్. త్వరలో పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.
'మిర్చి' చిత్రంలో ప్రభాస్ తల్లి పాత్రలో నటించిన నదియా ఈ సినిమాలో సమంత తల్లి పాత్రలో నటించబోతోంది. అదే విధంగా బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ కూడా ఈ చిత్రంలో గెస్ట్ రోల్ చేస్తున్నారు. మరో వైపు టాలీవుడ్ నవ్వుల డాన్ బ్రహ్మానందం రియల్ ఎస్టేట్ దాదాగా కనిపించబోతున్నారని తెలుస్తోంది.
బివిఎస్ఎన్ ప్రసాద్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఉగాది సందర్భంగా ఏప్రిల్ 11న విడుల చేయనున్నట్లు తెలుస్తోంది. సినిమా ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. సినిమా టైటిల్‌తో అన్ని వివరాలను త్వరలో అఫీషియల్ గా ప్రకటించనునున్నారు నిర్మాతలు.


Click it and Unblock the Notifications











