వెంకీ తో కలిసి నటించడానికి పవన్ రెడీ!
వెంకటేష్, పవన్ కళ్యాణ్ లిద్దరూ మంచి ఫ్రెండ్స్. తత్వంలో వీరిద్దరికీ సామ్యం ఉంది. వీరిద్దరూ వేధాంత ధోరణిలో మాట్లాడటంలో ఒకరిని మించినవారు మరొకరు. ఇదే వారిని మరో పనికి పురికొల్పుతున్నట్టు వినికిడి. ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో నటించాలని వారి ఆలోచనట. ఈ విషయాన్ని బహిరంగంగానే ప్రకటించారు. సమస్యల్లా సినిమా తీసేవారే లేకపోవడం. ముందు కథ రాసేవారుండాలి. వీరిద్దరికీ సూటయ్యే కథ రచించాలి. గతంలో తమిళ సినిమా రీమేక్ లో కలిసి నటించాలని అనుకుంటుండగానే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయి కూర్చుంది. వీరిద్దరూ దెబ్బకు బెదిరారు. పవన్ తనతో కలిసి నటించడానికి సిద్ధంగా ఉన్నాడని వెంకటేష్ ఈ మధ్యే అన్నాడు. ఎవరైనా సరైన కథతో ముందుకు వస్తే మేం రెడీ అనీ కూడా వెంకీ స్పష్టం చేశాడు.


Click it and Unblock the Notifications











