జనవరిలో పవన్ పులి
తమిళ డైరెక్టర్ కమ్ యాక్టర్ ఎస్.జె.సూర్య, పవన్ కళ్యాణ్ హీరోగా మరో సినిమా చేయనున్నాడు. ఈ సినిమా పేరు పులిగా అనుకుంటున్నారు. వచ్చే జనవరి 16న షూటింగ్ మొదలయి 2008 దసరా రోజున విడుదల చేయనున్నారు. ఈ సినిమాను సింగమలై రమేష్ నిర్మించనున్నారు. సూర్య దర్శకత్వంలో పవన్ హీరోగా గతంలో వచ్చిన ఖుషీ సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











