వేశ్యగా శ్రియ (పవిత్ర మూవీ ఫస్ట్ లుక్)
హైదరాబాద్: తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా 'దేవస్థానం' అనే అచ్చ తెలుగు సినిమాని దర్శకుడు జనార్ధన మహర్షి తెరకెక్కించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన రక్తిరస చిత్రం తెరకెక్కిస్తున్నారు. మాటల రచయితగా పేరు తెచ్చుకుని దర్శకుడిగానూ అవతారమెత్తిన జనార్థన మహర్షి తాజాగా రూపొందిస్తున్నఆ రక్తిరస చిత్రమే 'పవ్రిత'.
నాజూకు అందాల భామ శ్రియ ఇందులో టైటిల్ రోల్‌లో నటిస్తోంది. ఓవేశ్య కథగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫక్తు రక్తి చిత్రంగా తెరకెక్కుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తన గత చిత్రం 'దేవస్థానం' ని భక్తి నేపథ్యంలో తెరకెక్కించిన జనార్ధన మహర్షి... తన తాజా చిత్రాన్ని అందుకు భిన్నంగా రక్తి నేపథ్యంలో రూపొందించడం వార్తల్లో నిలుస్తోంది.
'ఈగ' వంటి కమర్షియల్ హిట్ మూవీకి మాటలు రాసి చాన్నాళ్ల తర్వాత విజయంలోని మాధుర్యాన్ని మరోసారి గుర్తు చేసుకున్న జనార్థన మహర్షి అదే స్పీడుతో తను మెగాఫోన్ పట్టి తెరకెక్కిస్తున్న చిత్రంతోనూ హిట్ అందుకోవాలని తాపత్రాయపడుతున్నట్లు చిత్ర యూనిట్ చెప్పుకొస్తోంది. మరి ఆయన ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications












