స్త్రీల గౌరవాన్ని పెంచే వేశ్యగా శ్రీయ(ఫోటో ఫీచర్)
హైదరాబాద్ : హీరోయిన్ శ్రీయ తాజాగా 'పవిత్ర' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమె వేశ్య పాత్ర పోషిస్తుంది. జనార్ధన మహర్షి దర్శకుడు. ప్రస్తుతం ఈచిత్రం 60శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా యూనిట్ సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి సినిమా వివరాలను వెల్లడించారు.
సినిమా గురించి శ్రీయ మాట్లాడుతూ...స్త్రీల గౌరవం పెంచే విధంగా సినిమా ఉంటుంది. కెరీర్లోనే బెస్ట్ క్యారెక్టర్ అవుతుంది. సాయి కుమార్, రోజాలతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని వెల్లడించింది. రోజా మాట్లాడుతూ.. ఈ సినిమాలో మీకు సరికొత్త రోజా కనిపిస్తుంది. ఇలాంటి సినిమాలను తీయడానికి ధైర్యం కావాలి. ఈ సాహసం చేస్తున్న దర్శకనిర్మాతలను మెచ్చుకోవాలి అని చెప్పుకొచ్చారు.
దర్శకుడు మాట్లాడుతూ...ఈ సినిమా స్త్రీల గౌరవం పెంచే విధంగా ఉంటుంది. ఇలాంటి సినిమాకు నేను దర్శకత్వం వహించడం ఆనందంగా ఉంది. పవిత్ర పాత్రకు శ్రీయ పర్ ఫెక్ట్ మ్యాచ్. ఈ నెలలో సినిమాను పూర్తి చేసి మార్చిలో విడుదల చేస్తామని తెలిపారు. సినిమాలో కొన్ని సీన్లు, డైలాగులు ప్రేక్షకులను తప్పకుండా ఆలోచింప చేస్తాయి. ఇదో మంచి సామాజిక చిత్రంగా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం చేసారు.

పవిత్ర సినిమా టీం

చిత్ర యూనిట్ సభ్యుల మీడియా సమావేశం

నవ్వులు చిందిస్తున్న రోజా, శ్రీయ

పవిత్ర మూవీ పోస్టర్
ఈ సమావేశంలో ఇంకా ఏవీఎస్, సాయికుమార్, నిర్మాత సాధక్ కుమార్, చింటు, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానకి సంగీతం : ఎంఎం.శ్రీలేఖ, కెమెరా : విఎన్. సురేష్, ఎడిటింగ్ : రమేష్, ఆర్ట్ : నాగేంద్రబాబు, నిర్మాతలు : కె. సాధక్ కుమార్, జి. మహేశ్వరరెడ్డి, కథ, దర్శకత్వం : జనార్ధన మహర్షి.


Click it and Unblock the Notifications











