పవిత్రా లోకేష్, వీకే నరేష్ పిల్లల్ని కంటున్నారా? మళ్లీ పెళ్లి తర్వాత సంతానంపై ఏం క్లారిటీ ఇచ్చారంటే?
విలక్షణ నటుడు, నిర్మాత వీకే నరేష్, క్యారెక్టర్ ఆర్టిస్టు పవిత్రా లోకేష్ జంటగా నటించిన మళ్లీ పెళ్లి రిలీజ్‌కు ముందు సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు ముందు వారిద్దరి రిలేషన్ కేవలం మీడియాలోనే కాకుండా సొసైటీలో కూడా చర్చనీయాంశమైంది. పలు సంచలన సంఘటనలు, ప్రెస్ మీట్స్ వీకే నరేష్, పవిత్ర లోకేష్ బంధంపై ఆసక్తిని రేపాయి. అయితే వారిద్దరి జీవితం ఆధారంగా తెరకెక్కిన మళ్లీ పెళ్లి సినిమా ప్రమోషన్స్ కోసం మీడియాతో వారిద్దరూ మాట్లాడుతూ.. పిల్లల్ని కంటారా? అనే ప్రశ్నకు ఎలా స్పందించారంటే??
వీకే నరేష్, పవిత్రా లోకేష్ తమ సహజీవనంలో విజయనిర్మల, కృష్ణ దంపతుల జీవనశైలిని అనుసరిస్తున్నారు. విజయ నిర్మల, కృష్ణ కూడా తమ బంధాన్ని సుదీర్ఘంగా కొనసాగించారు. కానీ సంతానం విషయంలో దూరంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం పవిత్ర లోకేష్, వీకే నరేష్ కూడా అదే పంథాను అనుసరిస్తారా? లేక వారికంటూ ఓ సంతానం ఉండేలా జాగ్రత్త పడుతారా అనేది ప్రశ్నగా మారింది.

సంతానం విషయంపై పవిత్రా లోకేష్ మాట్లాడుతూ.. సమాజంలో ఎంతో మంది పిల్లలు తల్లిదండ్రులు లేకుండా అనాథలుగా ఉన్నారు. ఇంకా మేము మరో బిడ్డను కని సమాజానికి ఇవ్వడం కంటే.. సమాజంలోని అనాథలను ఆదరిస్తే అంతకంటే గొప్పగా ఏముంటుంది అని ప్రశ్నించారు. మేము జీవిత భాగస్వామ్యులుగా చేయాల్సిన గొప్ప విషయాలు చాలా ఉన్నాయి అని పవిత్రా లోకేష్ అన్నారు.
విజయ నిర్మల, కృష్ణ మధ్య నిస్వార్ధమైన ప్రేమ ఉన్నది. నేను, పవిత్రా లోకేష్ కలిసినప్పుడు కూడా అలాంటి రిలేషన్‌తోనే ముందుకు వెళ్లాం. ప్రస్తుతం మా సమస్యలను సరిద్దిద్దుకొంటాం. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. మేము ఎప్పుడూ మాకు ఐదుగురు పిల్లలు అని భావిస్తాం. రక్త సంబంధం కంటే.. ఎమోషనల్ రిలేషన్ చాలా పవర్‌ఫుల్ అని వీకే నరేష్ అన్నారు.
విజయ నిర్మల, కృష్ణ రిలేషన్‌లో నేను అలాంటి ఎమోషనల్ ప్రేమను పొందాను. మా అమ్మ పోయిన తర్వాత కృష్ణ గారు నాకు మానసికంగా ప్రేమను పంచారు. ఆయన మరణించిన తర్వాత నేను చాలా మానసికంగా కుంగిపోయాను. మా అమ్మ బతికి ఉన్నప్పుడు.. నీకు అన్ని ఇచ్చాను. కానీ మంచి భార్యను ఇవ్వలేదేని బాధపడేది. కానీ ఆమె బర్త్ డే రోజున ఆమె లాంటి వ్యక్తిని నాకు ఇచ్చారు అని వీకే నరేష్ చెప్పారు.
అయితే మాకు సంతానం విషయంలో ఆలోచించడం లేదు. కానీ శారీరకంగా మేము సిద్దమే. కానీ వచ్చే మూడేళ్లే మా ఇబ్బందులను పరిష్కరించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాం. ఇప్పుడు సరోగసి ద్వారా పిల్లల్ని కనే అవకాశం ఉంది. కానీ మేము ఇప్పుడు సంతానం కంటే.. ఆ అబ్బాయికి 20 ఏళ్లు వచ్చే సరికి.. మాకు 80 ఏళ్లు వస్తాయి. అలాంటి పరిస్థితి మాకు అవసరమా? అని వీకే నరేష్ అన్నారు.


Click it and Unblock the Notifications











