నరేష్ తో పెళ్ళంటూ వార్తలు.. భర్త గురించి పవిత్ర లోకేష్ కామెంట్స్ వైరల్
నటి పవిత్ర లోకేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కన్నడ నాట అనేక సీరియల్స్, సినిమాలలో నటించిన ఆమె తరువాత తెలుగులో ఎంట్రీ ఇచ్చి అనేక సినీ అవకాశాలు దక్కించుకున్నారు. అయితే ఎప్పుడూ కూడా ఆమె వార్తల్లోకి రాలేదు కానీ గత కొద్దిరోజుల నుంచి నరేష్ తో ఆమె వివాహం జరిగిందంటూ కొన్నిసార్లు, జరగబోతోంది అంటూ కొన్ని సార్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఏకంగా విడాకుల కోసం అప్లై చేశారని ప్రచారం జరుగుతున్న క్రమంలో ఆమె భర్త గురించి గతంలో చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే

పెళ్లి అంటూ
దిగ్గజ దర్శకురాలు, సినీ నటి విజయనిర్మల కుమారుడు నరేష్ పవిత్రను వివాహం చేసుకున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ వస్తోంది. ఇప్పటికే అందులో ఎలాంటి నిజం లేదు అని నరేష్ పీఆర్ టీమ్ స్పందించింది. ఈ వ్యవహారం వెలుగులోకి రావడానికి కారణం ఈ ఇద్దరూ కలిసి మహాబలిపురంలోని ఒక గుడికి జంటగా వెళుతూ కనిపించడమే.

చాలా గొప్పగా
ఈ దెబ్బతో వీరి వివాహానికి సంబంధించిన ప్రచారం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో మొదలైంది. ఈ వ్యవహారం మీద పవిత్ర లోకేష్ ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. కానీ తన భర్త ఎలాంటివాడు అనే విషయం మీద ఆమె ఐదేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్ అవుతున్నాయి. తన భర్త సుచేంద్ర ప్రసాద్ గురించి పవిత్ర సదరు ఇంటర్వ్యులో చాలా గొప్పగా చెప్పారు.

మరొకరిలో చూడలేమని
తామిద్దరం కలిసి ఒక సీరియల్‌లో నటించామన్న ఆమె, స్నేహమో, ప్రేమో, గౌరవమో తెలీదు కానీ.. ఒకరిపై ఒకరికి ఉన్న అభిమానంతో పెళ్లి చేసుకున్నామని చెప్పుకొచ్చారు. సుచేంద్ర ప్రసాద్ చాలా గొప్ప వ్యక్తన్న ఆమె తనతో పోల్చుకుంటే ఆయన చాలా మంచి వ్యక్తి అని, అలాంటి వ్యక్తిని మరొకరిలో చూడలేమని అన్నారు. ఆయనలో ఒక్క లోపాన్ని కూడా కనిపెట్టలేమని ఆయన నాతో ఎంతో గౌరవంతో మెలుగుతారని కూడా పవిత్ర అప్పట్లో చెప్పుకొచ్చారు.

అవకాశం వచ్చింది
ఆయన రచయిత, దర్శకుడు, నటుడు అయినా సరే. కానీ ఆయన నటుడిగానే తనకు నచ్చుతారని ఆమె అన్నారు. ఇద్దరు కలిసి జంటగా నటించే అవకాశం వచ్చింది అని ఆమె అన్నారు. అయితే ఇద్దరం ఒకేసారి షూటింగ్‌కు వెళ్తే పిల్లలను చూసుకోడానికి ఎవరూ ఉండరని.. ఆ అవకాశాలను వదులుకొనేవాళ్లమని అప్పట్లో ఆమె పేర్కొన్నారు. సుచేంద్ర ప్రసాద్ లాంటి భర్త దొరికినందుకు తాను చాలా లక్కీ అని, కొంచెం టైమ్ ఉన్నా సరే సుచేంద్ర నాకు వండి పెట్టేస్తారని, ఇంట్లో అన్ని పనులు కూడా ఆయన చేస్తారని పవిత్ర వెల్లడించారు.
Recommended Video


కలిసి ఉన్నారా?
సుచేంద్ర ప్రసాద్ పవిత్ర తనకే సొంతమని భావించేవారు కాబట్టి నేను చేసిన సినిమాలు కూడా చూసేవారు కాదనీ ఆమె అన్నారు. అందుకే తాను కూడా ఏ రోజు ఒత్తిడి చేయలేదని చెప్పుకొచ్చారు. అయితే ఇదంతా ఐదు ఏళ్ళ క్రితం సంగతి అయినా సరే ఇప్పుడు ఆమె తన భర్తతో కలిసి ఉన్నారా లేక నిజంగానే విడాకులకు అప్లై చేశారా అనే విషయం మీద ఎలాంటి క్లారిటీ లేదు


Click it and Unblock the Notifications











