Pavitra Lokesh: సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన పవిత్రా లోకేష్.. కారణం?

సినీ రంగం అంటేనే గ్లామర్ ప్రపంచం. ఈ రంగంలో ఏ రిలేషన్ ఎప్పుడు.. ఎలా మారుతుందో చెప్పలేం. అలాగే సినీ సెలబ్రిటీల్లో రెండు, మూడు పెళ్లిల్లు, అఫైర్లు సాధారణంగా జరిగే వ్యవహారాలే. అందులో కొన్ని హైలెట్ అయితే మరికొన్ని ఇంకొకరికి తెలియకుండానే కనుమరిగిపోతాయి. అయితే ఇటీవల సినీ హీరోల కంటే మోస్ట్ పాపులర్ గా మారింది సీనియర్ నటుడు నరేష్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్రా లోకేష్ రిలేషన్ షిప్. వీరిద్దరు లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారని, త్వరలోనే వివాహంతో ఒక్కటి కానున్నారని వార్తలు తెగ షికార్లు చేశాయి. అయితే తాజాగా పవిత్రా లోకేష్ హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఆ వివరాళ్లోకి వెళితే..

మీడియాలో హల్ చల్..

మీడియాలో హల్ చల్..

టాలీవుడ్ లో గత ఏడాది కాలంగా ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు సీనియర్ నటుడు నరేష్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్రా లోకేష్. వీరిద్దరూ లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోనున్నారని, అందుకోసం పలు ఆలయాలు కూడా చుట్టి వస్తున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీని తర్వాత నరేష్ మూడో భార్య రమ్య మీడియాలో హల్ చల్ చేయడంతో ఈ వివాదం హైలెట్ గా మారింది. అలాగే నరేష్, పవిత్రా లోకేష్ సోషల్ మీడియా వేదికగా తాము మంచి ఫ్రెండ్స్ అంటూ క్లారిటీ ఇచ్చుకునే ప్రయత్నం కూడా చేశారు. ఇక ఇప్పటికైతే ఈ వ్యవహారం సద్దుమణిగింది.

ఫొటోలు మార్ఫింగ్ చేసి..

ఫొటోలు మార్ఫింగ్ చేసి..

ఇదిలా ఉంటే ఇటీవల సూపర్ స్టార్ మరణం తర్వాత ఆయన అంత్యక్రియలు ఏర్పాట్లు, ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్న సమయంలో నరేష్, పవిత్రా లోకేష్ జంటగా కనిపించారు. దీంతో పలు వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానెల్స్ లలో వివిధ రకాలుగా కథనాలు వెలువడ్డాయి. ఈ విషయమై తాజాగా ఆర్టిస్ట్ పవిత్రా లోకేష్ హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తన పట్ల, నటుడు నరేష్ పట్ల సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ మీద అభ్యంతరకర కామెంట్లతో పాటు ఫొటోలు సైతం మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇంకా తీసుకోని విడాకులు..

ఇంకా తీసుకోని విడాకులు..

క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్రా లోకేష్ ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నట్లు వాళ్లు పేర్కొన్నట్లు తెలుస్తోంది. పలు టీవీ ఛానెళ్లు సైతం తమపై ఉద్దేశపూర్వకంగానే దుషప్రచారం చేస్తున్నాయని ఫిర్యాదులో పవిత్రా లోకేష్ పేర్కొన్నట్లు సమాచారం. కాగా నరేష్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మూడో భార్య అయిన రమ్య రఘుపతికి ఇంకా విడాకులు ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే పవిత్రా లోకేష్ తో నరేష్ ఉండటంపై ఆమె తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇక 2007లో సుచేంద్ర అనే వ్యక్తితో పవిత్రా లోకేష్ కి వివాహం జరిగింది. వీరిద్దరూ కూడా విడాకులు తీసుకోలేదని టాక్ నడుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X