మా బంధం గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. దాగుడు మూతలు ఆడలేదు.. పవిత్రా నరేష్
పవిత్ర లోకేష్, వీకే నరేష్ గురించి రిలేషన్ మీడియాలో సెన్సేషనల్ అనే విషయం కొత్తగా చెప్పనక్కర్లేదు. అలాంటి ఇద్దరు కలిసి, వారి వారి జీవితాల్లో జరిగిన సంఘటనలతో రూపొందిన చిత్రంలో నటిస్తే ఎంత క్రేజ్ ఉంటుందో అందరికి తెలిసిందే. ఇలాంటి కథతో వస్తున్న చిత్రం మళ్లీ పెళ్లి. విజయ కృష్ణ బ్యానర్‌పై వీకే నరేష్ నిర్మిస్తున్న చిత్రానికి ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మే 26న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో పవిత్రా నరేష్ మాట్లాడుతూ..
సమాజాన్ని ఎవరూ కరెక్ట్ చేయలేరు. కొన్ని సంఘటనలు మనకు ప్రమేయం లేకుండా జరిగిపోతుంటాయి. నా జీవితంలో జరిగిన సంఘటనల నుంచి బయటపడటానికి చాలా కష్టపడ్డాను. కొంత మంది నా క్యారెక్టర్‌ను డ్యామేజ్ చేయడానికి ప్రయత్నించారు. నాకు ఎదురైన సమస్యల వల్ల సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాంటి పరిస్థితుల వల్ల నేను బయటపడ్డానంటే అందుకు కారణం వీకే నరేష్ అని పవిత్ర లోకేష్ చెప్పారు.

నా జీవితంలో చోటు చేసుకొన్న సమస్యలు చాలా దారుణం. నా జీవితం పూర్తిగా నాశనం అయిపొందని అనుకొన్నాను. పూర్తిగా నాశనమైన జీవితాన్ని సరిద్దిద్దుకొనేందుకు పెద్ద సాహసం చేశాను. మెఅల్లమెల్లగా ఒక్కో పరిస్థితిని మెరుగు పరుచుకొంటూ ఎదుగుతున్న సమయంలో వీకే నరేష్‌తో పరిచయం అయింది. అక్కడ నుంచి నా జీవితం పాజిటివ్‌గా మారిపోయింది అని పవిత్రా లోకేష్ చెప్పారు.

విజయ నిర్మల గారితో నేను ఎక్కువగా గడపలేదు. అప్పటికే ఆమె ఆరోగ్యం దెబ్బ తిన్నది. ఆ సమయంలోనే నేను నరేష్‌ను కలిశాను. ఆమెతో ప్రయాణించే అవకాశం దక్కలేదు. కానీ కృష్ణ గారితో నేను ఎక్కువగా సమయాన్ని గడిపాను. ఆయన చెప్పే విషయాలు చాలా విన్నాను. ఆయన నుంచి చాలా నేర్చుకొన్నాను. నేను చాలా విషయాలు పంచుకొన్నాను. మహేష్ బాబు, కృష్ణ ఫ్యామిలీ నన్ను సాధారంగా ఆహ్వానించారు అని పవిత్రా లోకేష్ చెప్పారు.

వీకే నరేష్‌తో ఉండే రిలేషన్‌షిప్ దాగుడు మూతలు ఏమీ లేదు. ఫ్యామిలీ యాక్సెప్టెన్స్ ఉంది కాబట్టి. మేము ఎవరికి చెప్పుకోవాల్సిన పరిస్థితి లేదు. గుట్టుగా ఉండే మా జీవితాన్ని బాహ్య ప్రపంచంలోకి పడేశారు. అప్పటి నుంచే మా జీవితం పబ్లిక్ అయింది. అయితే ఈ సినిమా ద్వారా మేము మా రిలేషన్‌ను అధికారంగా చేసుకోవాలనే ప్రయత్నం చేయడం లేదు. ఎందకంటే సమాజం మా బంధాన్ని ఒప్పుకొన్నది అని పవిత్రా లోకేష్ అన్నారు.

మళ్లీ పెళ్లి సినిమా విషయానికి వస్తే.. మంచి కథ, ఆసక్తికరమైన కథనం, ఆకట్టుకొనే మ్యూజిక్. హై ఎమోషనల్ పాయింట్స్ ఉన్నాయి. మంచి వినోదం ఉంటుంది. ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. అయితే ప్రతీ సినిమాకు మాదిరిగానే రిలీజ్ ముందు కొంత నెర్వస్ ఉంటుంది. ఇక ఈ సినిమా ముఖ్యంగా మాపై పెట్టుబడి పెట్టారు కాబట్టి.. కొంత నెర్వస్ ఎక్కువగా ఉంటుంది అని పవిత్రా లోకేష్ అన్నారు.


Click it and Unblock the Notifications











