అదిరిపోయే సెటైర్లు శ్రీరెడ్డి పైనేనా.. కాస్టింగ్ కౌచ్ అంటున్నవాళ్ళ దుమ్ము దులిపిన నటి పవిత్ర లోకేష్

Recommended Video

Pavitra Lokesh Indirect Comments On Sri Reddy

కాస్టింగ్ కౌచ్ గురించి అన్ని చిత్ర పరిశ్రమల్లో ప్రస్తుతం జరుగుతోంది. అవకాశాల పేరుతో వర్తమాన నటీమణులని వాడుకుంటున్నారనే వాదనని దీనిపై పోరాటం చేస్తున్న శ్రీరెడ్డి లాంటి వాళ్ళు చెబుతున్నారు. కానీ కాస్టింగ్ కౌచ్ కి అంగీకరించాలా లేదా అనే నిర్ణయం నటీమణులదే అని వాదించే వారూ లేకపోలేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న నటి పవిత్ర లోకేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో కాస్టింగ్ కౌచ్ గురించి స్పందించారు. పవిత్ర లోకేష్ కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ శ్రీరెడ్డిపై పరోక్షంగా సెటైర్లు పేల్చారు. కాస్టింగ్ కౌచ్ విషయంలో తన సంచలన అభిప్రాయాన్ని నటి పవిత్ర వెల్లడించింది.

చాలా సున్నితమైన అంశం

చాలా సున్నితమైన అంశం

కాస్టింగ్ కౌచ్ చాలా సున్నితమైన అంశం. ఈ విశ్వంలో ఆడ, మగ జాతులు ఉన్నాయి . ఆడవాళ్లు మగవాళ్ళని, మగవాళ్ళు ఆడవాళ్ళని ఉపయోగించుకోవడం అనేది అన్ని రంగాల్లో ఉంది. అది నేచర్ కూడా అని పవిత్ర అన్నారు.

బ్రతకడానికి డబ్బు అవసరం

బ్రతకడానికి డబ్బు అవసరం

మనం బ్రతకడానికి డబ్బు అవసరం అని పవిత్ర అన్నారు. అధిక మొత్తంలో డబ్బు కావాలని భవిస్తే అదేస్థాయిలో ఇతర పనులు కూడా చేయాల్సి ఉంటుంది. ఆ పని చేసే ముందు ఎందుకు చేస్తున్నాం అని ఆలోచించాలి. అంగీకరించి ఆ పని చేస్తే అది మన సమస్య మాత్రమే అవుతుందని పవిత్ర అన్నారు.

సినిమా చాలా చిన్నది

సినిమా చాలా చిన్నది

ఈ ప్రపంచంలో సినిమా అనేది చాలా చిన్న విషయం. బ్రతకడానికి ఇంకా ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇలాంటి పనులు చేయాలావద్దా అనేది మన ఛాయిస్. మనం అంగీకరిస్తేనే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారని పవిత్ర అన్నారు..

కాస్టింగ్ కౌచ్ అనేది పెద్ద పేరు

కాస్టింగ్ కౌచ్ అనేది పెద్ద పేరు

అసలు ఈ వ్యవహారానికి కాస్టింగ్ కౌచ్ అంటూ చాలా పెద్ద పేరు పెట్టారు. 4, 5 సంవత్సరాల చిన్నారులు రేప్ కి గురవుతున్నారు. ఇది అసలు పెద్ద విషయం అని పవిత్ర అన్నారు. ఎవరైనా మాట్లాడితే ఈ విషయం గురించి మాట్లాడాలని పవిత్ర సూచించారు.

ఎందుకు ఇంత రచ్చ

ఎందుకు ఇంత రచ్చ


పరిణితి చెందిన ఇద్దరు ఆడ, మగ మధ్య జరిగిన వ్యవహారం గురించి ఎందుకు ఇంత రచ్చ. దీనికి అంగీకరిస్తున్న వారంతా 4, 5 ఏళ్ళు ఉన్న చిన్నారులా అని పవిత్ర ప్రశ్నించారు. ఎదో ఆశించే ఈ ఆ పనికి ఒప్పుకుంటున్న వారే మళ్ళీ కాస్టింగ్ కౌచ్ అంటూ గేమ్ ఆడుతున్నారని పవిత్ర లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అగ్రిమెంట్ ప్రకారం

అగ్రిమెంట్ ప్రకారం

ఆడ, మగ మధ్య జరుగుతున్న విషయానికి అగ్రిమెంట్ ప్రకారం అంగీకరిస్తున్నారు. ఈ విష్యనిని మొదట్లోనే నో చెప్పే ఛాయిస్ మీకు ఉంది. కానీ ఎందుకు అలా చేయడం లేదు. కాని ఇప్పుడు బయటకు వచ్చి వాడుకున్నారు అంటే ఎలా అని పవిత్ర అన్నారు.

మీ బుద్ది ఏమైంది

మీ బుద్ది ఏమైంది

అంతా జరిగాక ఇప్పుడు మాట్లాడితే ముందుగా మీ బుద్ది ఏమైనట్లు అని పవిత్ర ఘాటు వ్యాఖ్యలు చేశారు. చిన్నారులు దారుణంగా రేప్ కబడుతున్న ఘటనల గురించి అంతా మాట్లాడాలి. కాస్టింగ్ కౌచ్ అనే అనవసరమైన విషయం గురించి కాదని పవిత్ర అన్నారు.

శ్రీరెడ్డి రెస్పాన్స్

శ్రీరెడ్డి రెస్పాన్స్


శ్రీరెడ్డి కూడా పవిత్ర లోకేష్ వ్యాఖ్యలపై పరోక్షంగానే స్పందించింది. ఇలా పతివ్రతలా మాట్లాడడం ఆపండి. మీరు ఎం చేసారో మీకు తెలుసు. కానీ సమాజానికి భయపడే ఇలా మాట్లాడుతున్నారు అని శ్రీరెడ్డి తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X