దుష్ణశక్తులు నా జీవితాన్ని నాశనం చేశాయి.. ఓ శక్తిగా నా వెనుక.. ఆ ఇద్దరి కాళ్లకు మొక్కిన పవిత్రా లోకేష్

నటుడు, నిర్మాత వీకే నరేష్ నిర్మాణ సారథ్యంలో విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన చిత్రం మళ్లీ పెళ్లి. వీకే నరేష్, పవిత్ర లోకేష్ కలిసి నటించడంతో రిలీజ్‌కు ఒక రకమైన సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఎమోషనల్ మూమెంట్ల మధ్య జరిగింది. మే 26న రిలీజ్ అవుతున్న ఈ చిత్రం నేపథ్యంలో ప్రమోషనల్ కార్యక్రమాలు ఊపందుకొన్నాయి. ఈ నేపథ్యంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటి పవిత్రా లోకేష్ భావోద్వేగంతో మాట్లాడుతూ...

కొత్త జీవితం ప్రారంభిస్తున్నా: మళ్లీ పెళ్లి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడటానికి ముందు మీ దీవెనలు కావాలి. ఈ వేడుకకు హాజరైన పెద్దల ఆశీర్వాదం కావాలి అంటూ వీకే నరేష్, దర్శకుడు ఎంఎష్ రాజు కాళ్లకు నమస్కరించింది. ఆ తర్వాత మాట్లాడుతూ.. నేను కొత్త జీవితం ప్రారంభిస్తున్నాను. దేవుడు అందరికీ కొత్త జీవితం ప్రసాదించరు. నాకు కొత్త జీవితాన్ని ప్రారంభించే అవకాశం వచ్చింది అని పవిత్రా లోకేష్ భావోద్వేగానికి గురయ్యారు.

Pavitra Lokesh touches the feet of VK Naresh and MS Raju at Malli Pelli pre release event

కొన్ని దుష్టశక్తులు నా జీవితాన్ని: నా తండ్రి నా చిన్నతనంలోనే మరణించారు. అందరు అమ్మాయిల మాదిరిగానే నాకు ఎన్నో కలలు ఉండేవి. డబ్బు, పేరు సంపాదించాలనే కోరికతో నా జీవితాన్ని మొదలుపెట్టాను. నా కోరికలు తీర్చుకోవడానికి సినిమా రంగానికి వచ్చాను.

నేను ఒంటరిగా ప్రయాణించి.. నా జీవితాన్ని అందంగా నిర్మించుకొన్నాను. కానీ కొన్ని దుష్టశక్తులు నా అనుమతి లేకుండా కూల్చారు. దాంతో నా జీవితం చాలా దుర్భరంగా మారింది. అది తలచుకొంటే చాలా గుండె పగిలినంత పని అవుతుంది అని పవిత్రా నరేష్ అన్నారు.

Pavitra Lokesh touches the feet of VK Naresh and MS Raju at Malli Pelli pre release event

విజయ నిర్మల గురించి: నా జీవితాన్ని కొన్ని దుష్టశక్తులు కూల్చినప్పుడు.. నా వెనుక ఒక శక్తి నిలబడింది. ఆ శక్తి వీకే నరేష్ గారు. ఆ దుష్ట శక్తులకు నరేష్ శక్తి ఏమిటో తెలియదు. ఆయన సహకారంతో నేను కొత్త జీవితాన్ని నిర్మించుకొన్నాను. నాకు ఆ శక్తిని విజయ నిర్మల ఇచ్చింది. ఆడవాళ్లను గౌరవించాలనే సంస్కారాన్ని ఆమె నరేష్‌కు ఇచ్చింది అని పవిత్ర లోకేష్ చెప్పారు.

Pavitra Lokesh touches the feet of VK Naresh and MS Raju at Malli Pelli pre release event

కృష్ణ, మహేష్ ఫ్యాన్స్ అంగీకరించి: వీకే నరేష్ మళ్లీ విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌ను యాక్టివ్ చేశారు. ఈ బ్యానర్‌పై మరిన్ని సినిమాలు తీస్తారు. ఆయనకు అంతా మంచి జరుగాలని కోరుకొంటున్నాను. స్వచ్చమైన ఆలోచనలతో కొత్త జీవితాన్ని నిర్మించుకొంటున్నాను. ఈ జీవిత ప్రయాణంలో నాకు అన్నగా మారిన ఎంఎస్ రాజు, జయసుధ గారికి ధన్యవాదాలు. కృష్ణ, మహేష్ బాబు ఫ్యాన్స్ నన్ను అంగీకరించి.. ఫ్యామిలీలోకి ఆహ్వనించినందుకు థ్యాంక్స్ అని పవిత్ర లోకేష్ అన్నారు.

Pavitra Lokesh touches the feet of VK Naresh and MS Raju at Malli Pelli pre release event

వనితా విజయ్ కుమార్‌తో కలిసి: మళ్లీ పెళ్లి సినిమా విషయానికి వస్తే.. ఎంఎస్ రాజు ఈ సినిమా షూటింగులో నాకు చాలా అండగా నిలిచారు. నేను అడిగే ప్రశ్నకు సరైన సమాధానం ఇచ్చారు. ఈ సినిమాలో వనితా విజయ్ కుమార్‌తో కలిసి నటించడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరికి నా ధన్యవాదాలు. ప్రతీ ఒక్కరు మనసు, హృదయం పెట్టి సినిమా చేశారు అని పవిత్రా లోకేష్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X