వేశ్య పాత్రలో శ్రియ హాట్ లుక్ (పవిత్ర వాల్ పిక్స్)
హైదరాబాద్: హాట్ హీరోయిన్ శ్రియ త్వరలో వెండి తెరపై వేశ్యగా తన సెక్సీ యాటిట్యూడ్‌తో అలరించబోతోంది. ఆమె నటిస్తున్న 'పవిత్ర' చిత్రం ఈ సమ్మర్లో విడుదలకు సిద్ధం అవుతోంది. జనార్ధన మహర్షి దర్శకత్వం వహించిన ఈచిత్రంలో శ్రియ పోషించి వేశ్య పాత్ర ఆమె కెరీర్లోనే బెస్ట్ రోల్ అవుతుందట.
ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ... ఈ సినిమా స్త్రీల గౌరవం పెంచే విధంగా ఉంటుంది. ఇలాంటి సినిమాకు నేను దర్శకత్వం వహించడం ఆనందంగా ఉంది. పవిత్ర పాత్రకు శ్రియ పర్ ఫెక్ట్ మ్యాచ్. సినిమాలో కొన్ని సీన్లు, డైలాగులు ప్రేక్షకులను తప్పకుండా ఆలోచింప చేస్తాయి. ఇదో మంచి సామాజిక చిత్రంగా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం చేసారు. తాజాగా ఈచిత్రం న్యూ వాల్ పేపర్స్ విడుదలయ్యాయి. వాటిని స్లైడ్ షోలో వీక్షించండి.

పవిత్ర సినిమాలో శ్రియ మెడ్రన్ వేశ్యగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.

పవిత్ర మూవీ షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ఏప్రిల్ 6, 7 తేదీల్లో ఆడియో విడుదల కానుంది

శ్రియ మాట్లాడుతూ... కెరీర్లోనే బెస్ట్ క్యారెక్టర్ అవుతుందని చెప్పుకొచ్చారు.

దర్శకుడు మాట్లాడుతూ ఈ సినిమా స్త్రీల గౌరవం పెంచే విధంగా ఉంటుందని వెల్లడించారు.

ఇదో మంచి సామాజిక చిత్రంగా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు దర్శకుడు.

ఈ చిత్రానకి సంగీతం: ఎంఎం.శ్రీలేఖ, కెమెరా: విఎన్. సురేష్, ఎడిటింగ్: రమేష్, ఆర్ట్: నాగేంద్రబాబు, నిర్మాతలు: కె. సాధక్ కుమార్, జి. మహేశ్వరరెడ్డి.

ఈ మధ్య పెద్దగా హిట్లు లేని శ్రియ ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకుంది.


Click it and Unblock the Notifications











