శ్రీయ వేశ్యగా...బోల్డ్ సీన్స్‌తో గోల్డ్ సినిమానట!

By Bojja Kumar

హైదరాబాద్ : శ్రీయ టైటిల్ రోల్‌లో జనార్ధన మహర్షి దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'పవిత్ర'. ఉప శీర్షిక 'ఎ బోల్డ్ అండ్ గోల్డ్ ఫిల్మ్'. కె. సాదక్ కుమార్, జి. సాయి మహేశ్వర రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు పాటలు మినహా పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాతలు మీడియాకు ఈ సినిమా వివరాలు వెల్లడించారు.

నిర్మాతలు మాట్లాడుతూ...'జనార్ధన మహర్షి అద్భుతమైన కథ ఇచ్చారు. కథనం కూడా బాగా కుదిరింది. టైటిల్ రోల్‌ని శ్రీయ అద్భుతంగా చేస్తోంది. స్త్రీ ఔన్నత్యాన్ని చాటి చెప్పే చిత్రం ఇది. నిజాయితీగా ఓ మంచి ప్రయత్నం చేస్తున్నాం. అందుకే ఇది బోల్డ్ సినిమా అయినా గోల్డ్ లా ఉంటుందని దర్శకుడు అంటున్నారు' అని చెప్పారు.

దర్శకుడు మాట్లాడుతూ...'శ్రీయ కొత్త కోణంలో కనిపించే చిత్రం ఇది. అలాగే కౌశిక్ కు ఈ చిత్రం మంచి బ్రేక్ అవుతుంది. నటి రోజా ఇప్పటి వరకు చేయని పాత్రను ఇందులో చేస్తున్నారు. ఇందులో ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది. మార్చిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం' అని చెప్పారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఏవీఎస్, సాయి కుమార్, శివాజీ, రవిబాబు, తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానకి సంగీతం : ఎంఎం.శ్రీలేఖ, కెమెరా : విఎన్. సురేష్, ఎడిటింగ్ : రమేష్, ఆర్ట్ : నాగేంద్రబాబు, నిర్మాతలు : కె. సాధక్ కుమార్, జి. మహేశ్వరరెడ్డి, కథ, దర్శకత్వం : జనార్ధన మహర్షి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X