twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగు చిత్రసీమలో విషాదం: ప్రముఖ నిర్మాత మృతి.. సినీ పెద్దల సంతాపం

    |

    తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. విక్టరీ వెంకటేష్‌తో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలు నిర్మించిన సీనియర్ నిర్మాత సి. వెంకట్ రాజు మరణించారు. మార్చి 8వ తేదీన ఆయన తుది శ్వాస విడిచారు. దీంతో టాలీవుడ్ సర్కిల్స్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

    అనారోగ్యంతో మృతి.. సినీ ప్రముఖుల సంతాపం

    అనారోగ్యంతో మృతి.. సినీ ప్రముఖుల సంతాపం

    గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సి. వెంకట్ రాజు మార్చి 8న (ఆదివారం) రోజు చెన్నైలో మృతిచెందారు. సోమవారం వెంకట్ రాజు అంత్యక్రియలు చెన్నైలోనే జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. ఈయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

    సి. వెంకట్ రాజు స్వగ్రామం.. తల్లిదండ్రులు

    సి. వెంకట్ రాజు స్వగ్రామం.. తల్లిదండ్రులు

    సి. వెంకట్ రాజు పూర్తి పేరు చమర్తి వెంకట్రాజు. చిత్తూరు జిల్లా సిద్దిరాజు కండ్రిగ గ్రామంలో 1948 మే 25న ఆయన జన్మించారు. ఆయన తల్లిదండ్రులు చమర్తి నారపరాజు, వెంకటమ్మ. అదే గ్రామానికి చెందిన శివరాజుతో కలిసి ఆయన శ్రీ విజయలక్ష్మి ఆర్ట్స్‌ ప్రొడక్షన్స్‌ అనే పతాకాన్ని స్థాపించారు.

    సూపర్ హిట్ సినిమాలకు నిర్మాత

    సూపర్ హిట్ సినిమాలకు నిర్మాత

    ఈ విజయలక్ష్మి ఆర్ట్స్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ''టూటౌన్‌ రౌడీ, నియంత, అహంకారి, ఆదర్శం, ఆరంభం'' లాంటి సినిమాలు రూపొందించిన అనంతరం గీత చిత్ర ఇంటర్నేషనల్‌ అనే మరో బ్యానర్ స్థాపించి సూపర్ డూపర్ హిట్ సినిమాలను రూపొందించారు.

    Recommended Video

    Rana Daggubati Hilarious Act With Anchor Suma At Jersey Success Meet || Filmibeat Telugu
    ప్రభాస్, వెంకటేష్‌లతో సినిమాలు

    ప్రభాస్, వెంకటేష్‌లతో సినిమాలు

    ఈయన ఎక్కువగా విక్టరీ వెంకటేష్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా ‘2 టౌన్ రౌడీ'. ఆ తర్వాత వెంకటేష్ తో కలిసి ‘పవిత్ర బంధం, పెళ్లిచేసుకుందాం' లాంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. ప్రభాస్ హీరోగా వచ్చిన చక్రం సినిమాకు కూడా ఈయనే నిర్మాత.

    English summary
    Senior producer C. Venkatraju paased away on March 8th in Chennai. Tollywood celebrities putting their condolence to his death
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X