twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'పంజా' గెడ్డం గురించి పవన్ వివరణ

    By Srikanya
    |

    మనోళ్లకి హీరో ఎప్పుడూ అందంగా,ప్రెష్ గా ఉండాలి,ఏ మాత్రం తేడా వచ్చినా నచ్చదు. అయినా ధైర్యం చేసి పంజాలో గెడ్డంతో ఢిఫెరెంట్ గెటప్ లో కనపించాను అన్నారు పవన్ కళ్యాణ్. ఆయన తాజా చిత్రం పంజా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వూలో గడ్డం గురించి చెప్పుకొచ్చారు. అలాగే నా ఉద్దేశం ఏమిటంటే..గెటప్ వల్ల సినిమాలు ఆడాలి. నేను చాలా సినిమాలు గెడ్డం లేకుండా నటించాను..కానీ అవేమీ ఆడలేదు. గజనీని నేను గుండు తీసుకుని చేస్తే ఆడుతుందో లేదో తెలియదు..నన్ను గజనీ చిత్రం చేయమని మొదట అడిగారు. నాకు ఆ విషయంలో ఆత్మ విశ్వాసం లేదు. గుండు గీసుకుని చేసి ఒప్పిస్తాననేంత నమ్మకం లేదు. ఆ భయం నాలో ఉండిపోయింది. అదే పాత్ర నేను చేస్తే చూస్తానో లేదో అన్న భయం ఉంది.

    అయినా ప్రొడ్యూసర్స్ కూడా కొత్తగా చేద్దామంటే ముందుకు రారు. అయినా నేను ఎలాగో దెబ్బలు తిన్నాం కదా కొత్తగా చెయ్యాలనిపిస్తుంది. గెడ్డం విషయానికి వస్తే కొత్త ప్రొడ్యూసర్స్ కాబట్టి ఏదో గెడ్డం పెట్టుకుని చేసినా ఓకే అయ్యింది. అదే సీజనల్ ప్రొడ్యూసర్స్ అయితే ఒప్పుకోరు అని పవన్ అన్నారు. పంజా చిత్రంలో పవన్ గెడ్డంతో కనపిస్తారు. ఆయన మాఫియాలో సీనియర్ మెంబర్ గా కనిపిస్తారు. తమిళ దర్శకుడు విష్ణు వర్ధన్ రూపొందించిన చిత్రం ఇది. ఈ నెల తొమ్మిదవ తేదీన ఈ చిత్రం అంతటా విడుదల అవుతోంది. ఈ చిత్రంపై పవన్ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. తీన్ మార్ చిత్రం తర్వాత వస్తున్న పవన్ చిత్రం ఇది. దీన్ని మాఫియా ఎంటర్టైనర్ గా పవన్ అభివర్ణిస్తున్నారు.

    English summary
    Panja touted to be a gangster classic. Pawan Kalyan's look in Panja has spawned a new bearded look across the state.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X