ప్చ్!.. దాన్ని కొట్టలేకపోయారే!: రెండో స్థానానికే పరిమితమైన పవన్..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఆ పేరు వింటేనే పూనకం వచ్చినట్లు ఊగిపోయే ఫ్యాన్స్ చాలామందే ఉన్నారు. పవన్ సినిమా అంటే చాలు.. ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద చూద్దామా? అన్న ఆత్రుత అభిమానులకు నిద్ర కూడా పట్టనివ్వదు.
Recommended Video

అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టే.. పవన్ సినిమాకు సంబంధించి ఏ టీజర్ లేదా ట్రైలర్ విడుదలైనా.. క్షణాల్లో వైరల్ అవడం కామన్ అయిపోయింది. తాజాగా విడుదలైన పవన్ కల్యాణ్ 'అజ్ఞాతవాసి' టీజర్ మరోసారి ఇదే విషయాన్ని రుజువు చేసింది. అయితే రికార్డులు బ్రేక్ చేయడంలో మాత్రం రెండో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి రావడం గమనార్హం.

64లక్షల వ్యూస్:
విడుదలైన అరగంట వ్యవధిలోనే పవన్ కల్యాణ్ 'అజ్ఞాతవాసి' టీజర్
మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. అదే జోరును కొనసాగిస్తూ 24గంటల్లో 64లక్షల వ్యూస్ సొంతం చేసుకుంది. అయితే 'అజ్ఞాతవాసి'లోను అత్తారింటికి దారేది ఛాయలు కనిపిస్తున్నాయని తాజా టీజర్ తర్వాత చాలామంది అభిప్రాయపడుతున్నారు.

మెర్సల్ తర్వాత 'అజ్ఞాతవాసి':
తెలుగుకు సంబంధించి 'అజ్ఞాతవాసి' వ్యూస్ ఒక రికార్డ్ అనే చెప్పుకోవాలి. కానీ సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీతో పోల్చితే మాత్రం రెండో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే.. తమిళ హీరో విజయ్ నటించిన మెర్సల్ టీజర్.. విడుదలైన 24గంటల్లోనే ఏకంగా 1.12కోట్ల వ్యూస్ సాధించింది. ఆవిధంగా 'అజ్ఞాతవాసి' మెర్సల్ తర్వాతి స్థానానికి పరిమితమైంది.

'లైక్స్' రికార్డు:
లైక్స్ విషయంలో మాత్రం పవన్ 'అజ్ఞాతవాసి' టీజర్ సరికొత్త రికార్డు సెట్ చేసింది. 24గంటల్లో 4.12లక్షల లైక్స్ వచ్చాయి. ఒక టీజర్‌కు ఈ స్థాయిలో లైక్స్ రావడం రికార్డు అని చెబుతున్నారు. 24గంటల్లో మరే టీజర్‌కు ఇంతకుముందు ఇన్ని లైక్స్ రాలేదంటున్నారు.

వివేగం రికార్డు బద్దలు:
వ్యూస్ విషయంలో పవన్ 'అజ్ఞాతవాసి' టీజర్ అజిత్ వివేగంను కూడా క్రాస్ చేసింది. అజిత్ వివేగం టీజర్ 24గంటల్లో 61లక్షల వ్యూస్ సాధిస్తే.. పవన్ 'అజ్ఞాతవాసి' టీజర్ 24గంటల్లో 64లక్షల వ్యూస్ సొంతం చేసుకుంది.
టీజర్ ఎలా ఉంది:
'మధురాపురి సదనా.. మృదు వదన... మధుసూదన' అనే బ్యాక్ గ్రౌండ్ సాంగుతో టీజర్ సాగుతుంది. ఈ సాంగ్ వింటున్నప్పుడు అత్తారింటికి దారేదిలో 'దేవం దేవం భజే సాంగ్' గుర్తుకురావడం సహజమే. అలాగే టీజర్ ఛాయలు చాలావరకు అత్తారింటికి దారేదిని గుర్తుకు తెచ్చేలా ఉన్నాయి. యాక్షన్ ఎపిసోడ్, చుట్టూ గ్యాంగ్, ఇంట్లో కామెడీ.. ఇవన్నీ మేళవించి టీజర్ విడుదల చేశారు.


Click it and Unblock the Notifications











