పవన్‌తో ఆఫర్ అబద్దం, వస్తే వదులుకోను!

By Bojja Kumar

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో త్వరలో రాబోతున్న చిత్రంలో జర్నీ ఫేం అంజలి హీరోయిన్‌గా ఎంపికైనట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అవన్నీ వట్టి పుకార్లే అని, తనకు పవర్ స్టార్‌తో ఛాన్స్ వచ్చినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని అంజలి స్పష్టం చేసింది. ఒక వేళ వస్తే మాత్రం వదులుకోనని, పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోలతో అవకాశం రావడానికంటే మించింది ఏమీ లేదని చెబుతోంది.

షాపింగ్ మాల్, జర్నీ లాంటి డబ్బింగ్ చిత్రాల్లో తన టాలెంట్ ప్రూవ్ చూసుకున్న అంజలి ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం ఆమె శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లు చెట్టు' చిత్రంలో వెంకటేష్‌కు జోడీగా నటిస్తోంది.

పవన్, త్రివిక్రమ్ సినిమా విషయానికొస్తే...ఇంకా టైటిల్ ఖరారు కాని ఈచిత్రాన్ని బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించబోతున్నాడు. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం అక్టోబర్లో మొదలయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా దీన్ని ప్లాన్ చేస్తుననట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈచిత్రాన్ని డివివి దానయ్య యూనివర్సల్ మీడియా పతాకంపై నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ నెల 24న ఆడియో, అక్టోబర్ 11న సినిమా విడుల చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X