వాటిని పట్టించుకోవద్దంటూ పవన్ కళ్యాణ్
పంజా విడుదలై డివైడ్ టాక్ రావటంతో పవన్ అభిమానులు బాగా డిజప్పాయింట్ అయిన సంగతి తెలిసిందే. అదే సమయంలో గబ్బర్ సింగ్ పై అంచనాలు కూడా బాగా పెరిగాయి. దాంతో ఆ ప్రెజర్ అంతా ఇప్పుడు దర్సకుడు హరీష్ శంకర్ పై పడింది. ఈ విషయం పవన్ నోటీస్ కి రావటంతో వెంటనే హరీష్ ని పిలిచి..అలాంటి వాటిని పట్టింకువద్దని,అనవరసమైన ఒత్తిడి పెట్టుకోవద్దని,నీ స్టైల్ లో సినిమాను నువ్వు స్క్రిప్టులో ఎలా రాసుకున్నావో అలాగే తీయమని ఎంకరేజ్ చేసాడని వినికిడి. ఇక పంజా టాక్ ని పట్టించుకోవద్దని క్లియర్ గా చెప్పటంతో హరీష్ శంకర్ కాస్త రిలీఫ్ ఫీలయ్యాడని అంటున్నారు. ఈ విషయం తెలిసిన వారు దటీజ్ పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఇక గబ్బర్ సింగ్ విషయానికి వస్తే..సల్మాన్ ఖార్ సూపర్ హిట్ దబాంగ్ కు అది రీమేక్. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా సాగే ఈ చిత్రంలో పవన్ ఓ పోలీస్ అధికారిగా కనిపిస్తారు.
ఈ చిత్రంపై చాలా అంచనాలే ఉన్నాయి. మాస్ ని ఆకట్టుకునే ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయని చెప్తున్నారు. సల్మాన్ కి తన కెరీర్ లో మళ్లీ తన అభిమానులు పూర్తిగా తృప్తి పరిచేలా అప్పట్లో ఈ చిత్రం రూపొందింది. అలాగే ఈ చిత్రంలై హైలెట్ డైలాగ్స్,ఐటం సాంగ్. మిరపకాయతో మాస్ ని సాటిస్ పై చేసే డైలాగ్స్ రాయగలనని ప్రూవ్ చేసుకున్న హరీష్ తనే డైలాగులు రాస్తూండటం ప్లస్ పాయింట్. అలాగే ఐటం సాంగ్ కి ఇంకా ఎవరిని ఫిక్స్ చేయలేదు. అయితే తమిళంలో దబాంగ్ రీమేక్ ప్లాప్ అయ్యింది.


Click it and Unblock the Notifications











