పుట్టిన రోజు వేడకలో పవన్ కళ్యాణ్ ( అరుదైన ఫోటోలు)
హైదరాబాద్ : తన పుట్టిన రోజుని జరుపుకోకపోయినా...యూనిట్ సభ్యుల పుట్టిన రోజు జరపటంలో పవన్ ముందుంటారు. తాజాగా 'సరదా' అనే టైటిల్ తో రూపొందుతున్న చిత్రం కో డైరక్టర్ సత్యం గారి పుట్టిన రోజు ని పొల్లాచిలో యూనిట్ సభ్యుల మధ్య గ్రాండ్ గా చేసారు.
పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా చేస్తున్నారు. కామెడీ ప్రధానంగా పంచ్ డైలాగులతో పూర్తి స్తాయి కమర్షియల్ వినోదాత్మక చిత్రంగా రూపొందుతోందని ఫిల్మ్ నగర్ టాక్.
'జల్సా' చిత్రానికి ఈ చిత్రం డబల్ డోస్‌లా ఉంటుందని యూనిట్ మెంబర్ చెప్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మేనరిజం, త్రివిక్రమ్ పంచ్ డైలాగులు సినిమాకు హైలెట్ కానున్నాయి. ఈచిత్రంలో పవర్ స్టార్ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడని, అతని క్యారెక్టరైజేషన్ కూల్ గా, హాస్య భరితంగా ఉంటుందని అంటుందని ఫిల్మ్ నగర్ టాక్.

రోజు రోజుకీ కుర్రాడిగా మారుతున్న పవన్ ఈ చిత్రంలో ఈ గెటప్ లో కనపడనున్నారు.

కో డైరక్టర్ సత్యం గారికి కేకు తినిపిస్తున్న పవన్

హీరోయిన్ సమంత కూడా ఈ వేడుకలో పాల్గొంది. సత్యం గారికి కేకు ఇస్తోంది.

త్రివిక్రమ్, సత్యం గారు, పవన్ కళ్యాణ్

అలీ, దేవిశ్రీ ప్రసాద్, సత్యం గారు, పీటర్ హెయిన్

పుట్టిన రోజు వేడుకలో జోష్ గా యూనిట్...

కెమెరా మెన్ మూరెళ్ల ప్రసాద్, సత్యం గారు, త్రివిక్రమ్

దర్శకుడు త్రివిక్రమ్...వర్కింగ్ స్టిల్

ఫ్యాన్స్ కు పండుగ చేసేలా...పవన్ కళ్యాణ్...

చిత్రంలో క్యూట్ గా సమంత లుక్...


Click it and Unblock the Notifications











