మూడో వివాహంపై పవన్ కళ్యాణ్ కామెంట్
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి గురించి గత కొంత కాలంగా మీడియాలో చర్చ సాగుతున్నసంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు వివాహాలు చేసుకున్న పవన్ కళ్యాణ్...తీన్‌మార్ సినిమాలో తనతో కలిసి నటించిన విదేశీ నటి, ఆస్ట్రేలియా మోడల్ డనా మార్క్స్‌ను మూడో వివాహం చేసుకున్నారనేది ఆ వార్తల సారాంశం. ఈ విషయమై పవన్ కళ్యాణ్ ని రీసెంట్ గా ఇండియా టుడే వారు ప్రశ్నించటం జరిగింది. దానికి పవన్ కూల్ గా సమాధాన మిచ్చారు.
పవన్ మాట్లాడుతూ... పర్శనల్ విషయాలన్నారు కదండీ, వాటిని పర్శనల్ గానే ఉంచాలని నా ఉద్దేశ్యం. వీటి మీద బయిట మాట్లాడటానికి ఏమీ ఉండదు అని తేల్చి చెప్పేసారు.
ఇక 'అత్తారింటికి దారేది' తరవాత పవన్ కల్యాణ్ సినిమా ఏదీ సెట్స్‌పైకి వెళ్లలేదు. కానీ కొత్త సినిమా కబుర్లు చాలానే వినిపిస్తున్నాయి. కొత్త కథలు పవన్ వింటున్నారు. పవన్‌తో సినిమాలు చేయడానికి నిర్మాతలు కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం పవన్ పచ్చజెండా వూపింది రెండు సినిమాలకే. 'గబ్బర్ సింగ్ 2'తో పాటు, 'ఓ మైగాడ్' తెలుగు రీమేక్‌ని ఒప్పుకొన్నారు.
'ఓ మైగాడ్'లో వెంకటేష్‌తో కలసి వెండితెరను పంచుకోనున్నారు. ఈ రెండు చిత్రాలూ ఇంచుమించు ఒకేసారి చిత్రీకరణ జరుపుకోనున్నాయి. త్వరలోనే 'గబ్బర్ సింగ్ 2' సెట్స్‌పైకి వెళ్లనున్నదని నిర్మాత శరత్‌మరార్ చెబుతున్నారు. 'ఓ మైగాడ్' తెలుగు రీమేక్‌కీ ఈయనే నిర్మాత. సురేష్ బాబుతో కలిసి ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 'గబ్బర్‌సింగ్ 2', 'ఓ మైగాడ్' తెలుగు రీమేక్ ఈ రెండు సినిమాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకొద్ది రోజుల్లో ప్రకటిస్తారు.


Click it and Unblock the Notifications












