పవన్ కోసం సెకండాఫ్ మార్చేస్తున్నారట: పవర్ స్టార్ కోసం చాలానే మార్చారు
సంతోష్ శ్రీనివాస్ డైరక్షన్ లో కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ తెరి సినిమాను పవన్ రీమేక్ చేస్తాడని తెలుస్తుంది. అయితే ఈ సినిమాను తెలుగులో దిల్ రాజు పోలీస్ అంటూ డబ్ చేసి రిలీజ్ చేశాడు.
Recommended Video

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం సినిమా సంక్రాంతికి రిలీజ్ చేస్తుండగా ఆ సినిమా తర్వాత సినిమాకు సంబందించిన ఓ న్యూస్ ఇప్పుడు అందరికి షాక్ ఇస్తుంది. జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత త్రివిక్రంతో పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పండుగ చేసుకునేలా సినిమా ఉంటుందట. 2018 సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ సినిమా పవన్ త్రివిక్రం కాంబోకి ఉన్న సత్తా ఏంటో చూపిస్తుందని. అంచనాలను అందుకునేలా సినిమా ఉంటుందని అన్నారు.

బడ్జెట్ లిమిట్ లేకుండా
కథ కథనాల మీద ఉన్న నమ్మకంతోనే సినిమా బడ్జెట్ లిమిట్ లేకుండా ఖర్చు పెడుతున్నారట. సంతోష్ శ్రీనివాస్ డైరక్షన్ లో కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ తెరి సినిమాను పవన్ రీమేక్ చేస్తాడని తెలుస్తుంది. అయితే ఈ సినిమాను తెలుగులో దిల్ రాజు పోలీస్ అంటూ డబ్ చేసి రిలీజ్ చేశాడు.

సూపర్ హిట్ అందుకున్నాడు
అట్లీ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాతో విజయ్ అక్కడ సూపర్ హిట్ అందుకున్నాడు. అయితే ఈ సినిమాలో కథలో సెకండ్ హాఫ్ మొత్తం మార్చేస్తున్నాడట సంతోష్ శ్రీనివాస్. సెకండ్ హాఫ్ పవన్ రేంజ్ కు తగ్గట్టుగా మార్చేయబోతున్నారట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుందట.

సెప్టెంబర్ కల్లా రిలీజ్
2019 ఎన్నికల సినిమాల్లో ప్రత్యక్ష రాజకీయల్లో పాల్గొననున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంతోష్ శ్రీనివాస్ మూవీని త్వరగా పూరి చేయాలని చూస్తున్నాడు. జనవరి చివర్లో మొదలు పెట్టబోతున్న ఈ సినిమా ఆగష్టు సెప్టెంబర్ కల్లా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

సంక్రాంతికి రిలీజ్
ప్రస్తుతం చేస్తున్న త్రివిక్రం మూవీ సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అజ్ఞాతవాసి టైటిల్ పెట్టే ఆలోచనలో ఉండగా దీపావళికి ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ వస్తుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











