చానాళ్ల తర్వాత పవన్, చరణ్ కలిసి...!
మెగా హీరోలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఒకే వేదికపై అభిమానులకు దర్శనం ఇచ్చి చాలా రోజులైంది. ఆ మధ్య చెర్రీ ఎంగేజ్ మెంట్ సమయంలో పవర్ స్టార్ చెర్రీని స్వయంగా తన కారులో తీసుకొచ్చారు. అయితే అది ప్రైవేట్ పంక్షన్ కావడంతో నేరుగా వారిని చూసే అవకాశం అభిమానులకు దక్కలేదు.
ఈ ఇద్దరిని ఒకే విదికపై కలిసి చూడాలనే అభిమానుల ఆశ త్వరలో నిజం కాబోతోంది. స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న 'జులాయి' ఆడియో వేడుకకు ఈ ఇద్దరు స్టార్స్ ముఖ్యఅతిథులుగా హాజరు కాబోతున్నారు. జూన్ 10న ఈ వేడుక జరుగబోతోంది. హైదరాబాద్ లోని HICCలో ఈ వేడుకను ప్లాన్ చేశారు.
జల్సా, మగధీర వేడుకల తర్వాత మెగా హీరోలంతా ఒకే వేదికపై కనిపించ లేదు. చాలా రోజుల తర్వాత మళ్లీ ఆ తరుణం రావడంతో ఫ్యాన్స్ అంతా చాలా ఉత్సాహంగా ఉన్నారు. పరిస్థితి చూస్తుంటే జులాయి ఆడియో వేడుకకు అభిమానుల తాకిడి భారీగానే ఉండేట్లు కనిపిస్తోంది.
జులాయి చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అర్జున్ సరసన ఇలియాన హీరోయిన్‌గా నటిస్తోంది. జూన్ 21 లేదా 22న ఈచిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. రాధాకృష్ణ ఈచిత్రాన్ని హారిక హాసిని ప్రొడక్షన్స్ బేనర్ నిర్మిస్తున్నారు. డివివి దానయ్య సమర్పకులు.
ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. గతంలో అల్లు అర్జున్, దేవిశ్రీ కాంబినేషన్లో...వరుసగా ఆర్య, బన్నీ, పరుగు, ఆర్య 2 లాంటి వరుస చిత్రాలు వచ్చాయి. దర్శకుడు త్రివిక్రమ్‌తో కలిసి దేవిశ్రీ పని చేసిన జల్సా చిత్రం మంచి మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. జులాయి చిత్రం కూడా అదే రేంజిలో అదరగొడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.


Click it and Unblock the Notifications











