పవన్ కళ్యాణ్ తాను నటుడిగానే కొనసాగుతానని, ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. యువరాజ్యం అధ్యక్షుడు హోదాలో ఆయన నల్గొండ జిల్లాలో పర్యటిస్తూ..ప్రజా సమస్యలను చర్చించాల్సిన చట్టసభలు వ్యక్తిగత విమర్శలకు వేదికలుగా మారా యని పవన్ కళ్యాణ్ తీవ్రంగా ధ్వజమెత్తారు.అలాగే తాను సినిమాలు కంటిన్యూ చేస్తానని అన్నారు. పవన్ ప్రస్తుతం పులి చిత్రం చేస్తున్నారు. అనంతరం పూరీ జగన్నధ్ దర్శకత్వంలో హాస్యనటుడు గణేష్ నిర్మించే చిత్రంలో నటిస్తారు. రాజకీయాల్లో తిరుగుతూ సినీ రంగానికి పవన్ దూరమవుతున్నాడంటూ అంతటా కామెంట్స్ వినిపిస్తున్న నేఫద్యంమలో ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో ఆయన సినీ అభిమానులకు సేద తీరినట్లయింది.