అన్నపూర్ణ స్టూడియోలో పవన్ స్టెప్పులు
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలోని 7 ఎకరాల స్థలంలో జరుగుతోంది. ఇక్కడ పవన్ కళ్యాణ్‌పై పాట చిత్రీకరణ జరుగుతోంది.
గత నెల ప్రారంభం అయిన ఈచిత్ర షూటింగ్ అక్టబోర్ 18న విడుదల చేయడమే లక్ష్యంగా హైదరాబాద్‌లోని వివిధ స్టూడియోల్లో శరవేంగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతోంది. తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈచిత్రాన్ని డివివి దానయ్య యూనివర్సల్ మీడియా బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
చిరంజీవి పుట్టిన రోజును పురస్కరించుకుని ఆగస్టు 22న ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కానుంది. పవన్ ఇందులో మెకానిక్‌గా నటిస్తుండగా, తమన్నా జర్నలిస్టు పాత్రలో నటిస్తోంది. ఈచిత్రం నైజాం రైట్స్ అల్లు అరవింద్‌కు సంబంధించిన గీతాఆర్ట్స్ దక్కించుకుంది.
కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం తర్వాత పవర్ స్టార్ శ్రీ వరసిద్ది వినాయక్ ప్రొడక్షన్స్ పతాకంపై కొండా కృష్ణం రాజు నిర్మించబోయే చిత్రంలో నటించబోతున్నారు. ఈ చిత్రం ద్వారా ఆయన తొలిసారి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.


Click it and Unblock the Notifications











