దాసరి-పవన్ కళ్యాణ్ మూవీ: తెరపైకి కొత్త కోణం...నిజమా?

By Bojja Kumar

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకరత్న దాసరి నారాయణరావు ఓ సినిమా నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆగస్టులో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అయితే ఈచిత్రానికి ఇంకా దర్శకుడు, స్టోరీ, హీరోయిన్ ఏ విషయాలు కూడా ఖరారు కాలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలపై కసరత్తు జరుగుతోంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ కొత్త కోణం చర్చనీయాంశం అయింది. దాసరి నారాయణరావుకు కొన్ని ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నాయని....పవన్ కళ్యాణ్‌తో తీసే సినిమా ద్వారా సదరు ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడవచ్చనే నమ్మకంతో దాసరి ఉన్నారట. ఇందులో నిజం ఎంతో తెలియదు కానీ...ఫిల్మ్ నగర్లో ఈ విషయం ఇపుడు చర్చనీయాంశం అయింది.

Pawan-Dasari film latest updates

ఈ చిత్రానికి తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వం వహించే అవకాశం ఉందని ఓ వైపు ప్రచారం జరుగుతున్నా..... మరో వైపు అతను కాదు, తెలుగు దర్శకుడు కిషోర్ పార్థసాని(డాలీ) దర్శకత్వం వహించే అవకాశాలే ఎక్కవ అని మరికొందరు అంటున్నారు. ఇటీవలే దాసరి నారాయణరావు డాలీతో సమావేశం అయినట్లు తెలుస్తోంది. వీరి మధ్య పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించిన చర్చలు జరిగినట్లు చెప్పుకుంటున్నారు.

ఇప్పటికే పవన్ కళ్యాణ్ సినిమా కోసం దాసరి నారాయణరావు మూడు సరికొత్త స్టోరీలు విన్నట్లు విన్నట్లు తెలుస్తోంది. ఈ మూడు స్టోరీలపై డాలీ ఒక అండర్ స్టాండింగుకు వచ్చిన తర్వాత...తనదైన శైలిలో స్క్రీన్ ప్లే జోడించి పవన్ కళ్యాణ్‌కు వినిపించే ప్లాన్స్ లో ఉన్నారని తెలుస్తోంది. ఒక వేళ డాలీ ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం దక్కించుకుంటే...అతి తక్కువ గ్యాపులోనే పవన్ కళ్యాణ్ సినిమాకు రెండోసారి దర్శకత్వం వహించే చాన్స్ దక్కించుకున్న దర్శకుడిగా నిలవనున్నాడు. గతంలో ఎస్.జె.సూర్య, కరుణాకరన్ పవన్ కళ్యాణ్ తో రెండు సార్లు సినిమా చేసినా...సినిమాల మధ్య గ్యాప్ దాదాపు పదేళ్లు ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X