పవన్ కూతురు గుర్రం ఎక్కింది(ఫన్ ఫొటో)
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ కుమార్తె ఆద్య గుర్రం రైడ్ చేస్తోంది. ఈ మూడు సంవత్సరాల ముద్దల పాపకు గుర్రం పై వెళ్లటం చాలా ఇష్టమైన ఏక్టివిటీ. ఈ విషయాన్ని పాప తల్లి రేణు దేశాయ్ ట్వీట్ ద్వారా ఈ ఫొటో ని పోస్ట్ చేసి తెలిపింది. ఆమె ట్వీట్ చేస్తూ..." ఆద్య తనకు ఇష్టమైన ఏక్టివిటీలో బిజీగా ఉంది. అది మరేదో కాదు హార్స్ రైడింగ్. మూడు సంవత్సరాల వయస్సు నుంచి ఇది చేస్తోంది. " అన్నారామె.
పవన్ కళ్యాణ్, రేణు దేశాయి ల కుమారుడు అకిరా నందన్. తనకు ఇష్టమైన జపాన్ దర్శకుడు అకిరా కురుసోవా పేరుతో తన కుమారుడుకి అకిరా అనే పెట్టుకున్నారు. ఇప్పుడు అదే అకిరా ఫిల్మ్స్ పేరుతో బ్యానర్ ఓపెన్ చేసింది రేణు దేశాయి. ఈ బ్యానర్ పై ఆమె మరాఠీలో సినిమాలో నిర్మించనుంది. ఈ బ్యానర్ పై Ishq Wala Love అనే చిత్రం ఆమె నిర్మిస్తోంది. అలాగే తమ కుమార్తె ఆద్య పేరున కూడా ఆమె ఓ బ్యానర్ ప్రారంభించి, సినిమాలు మొదలెడుతోంది.

వన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ఇద్దరూ విడాకులు తీసుకుని ఎవరి జీవితం వారు బ్రతుకుతున్న సంగతి తెలిసిందే. పవన్ ఇక్కడ సినిమాలు,రాజకీయాలు అంటూ బిజీగా ఉంటే... రేణు తన పిల్లలతో కలిసి పూనేలో ఉంటున్నారు. అక్కడ ఆమె మరాఠి చిత్రాలు నిర్మాణంలో బిజీ అయ్యారు. అయితే పవన్ మీద ఆమెకు ప్రేమ, అభిమానం తగ్గలేదు.
ఇక రీసెంట్ గా... రేణూ దేశాయ్ ప్రశంసల జల్లు కురిపించారు. చాలా వాస్తవ దృక్పథం కలిగిన వ్యక్తి అని, మానవత్వం కలిగిన వ్యక్తి అని కితాబిచ్చారు. పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక రేణు దేశాయ్ దాదాపు తొలిసారి స్పందించారు. ఓ టివి ఛానల్ ఇంటర్వ్యూ తర్వాత తాను మొదటిసారి పవన్ కళ్యాణ్ పైన బహిరంగంగా స్పందిస్తున్నానని చెప్పారు. పవన్‌కు కితాబిచ్చారు. పవన్ కళ్యాణ్ చాలా ఉదారమైన, ఉదాత్తమైన, వినయపూర్వకమైన, నిష్కళంకమైన వ్యక్తి అని, ఆయన హృదయం నిష్కళంకమైనదని చెప్పారు.


Click it and Unblock the Notifications











