పవన్, నాగార్జున, బ్రహ్మానందం ఒకేలా..!
తెలుగు సినిమాల్లో, ముఖ్యంగా మాస్ మసాలా ఎంటర్‌టైన్మెంట్ సినిమాల్లో డైలాగులు రోజు రోజుకు డెప్త్, డీసెన్సీ లేకుండా పోతున్నాయి. ఇటీవల వచ్చిన బిజినెస్ మేన్ సినిమా తీసుకుంటే అందులో ఎన్ని బూతులు ఉన్నాయో కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ మధ్య వస్తున్న ప్రతి సినిమాలోనూ ఇలాంటి డైలాగులే.
తాజాగా గబ్బర్ సింగ్ టీజర్ రిలీజ్ అయింది. ఇందులో పవన్ కళ్యాణ్ నోట 'నాకు తిక్క ఉంది..కాని దానికి లెక్క ఉంది' అనే డైలాగ్ వినిపించింది. అయితే ఈ డైలాగును పోలిన డైలాగ్ గతంలో నాగార్జున శివమణి సినిమాలో వినిపించింది. ఇందులో...నాగార్జున్ 'నా పేరు శివమణి..నాకు కొంచెం మెండల్' అనే డైలాగ్ కొడతాడు.
అదే విధంగా ఆ మధ్య వచ్చిన నేనింతే సినిమాలో కామెడియన్ బ్రహ్మనందం 'నేను ఎంత ఎదవనో నాకే తెలియదు' అనే డైలాగ్ అంటాడు. ఈ మూడు డైలాగులు ఒకేలా ఉన్నాయని, వేటిలో కూడా డెప్త్, డీసెంట్ లేదని చర్చించుకుంటున్నారు సినీ జనాలు.
గబ్బర్ సింగ్ సినిమా నిర్మాత గణేష్ బాబు ఇటీవల ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ....'నాకు తిక్క ఉంది..కాని దానికి లెక్క ఉంది' డైలాగ్ అదిరి పోయింది. ఈ సినిమాలో మాదర్శకుడు హరీష్ శంకర్ ఇలాంటి డైలాగులు బోలెడు రాశాడు అని చెప్పారు. అంటే గబ్బర్ సింగ్ సినిమాలో ఇలాంటి డైలాగులు ఎన్ని వినాల్సి వస్తుందో...?


Click it and Unblock the Notifications











