చెర్రీ కూడా ‘పవన్’ పేరునే...‘ఎవడు’లో డైలాగ్!
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాన్ పేరును వాడుకుని తమ సినిమాలకు ఉపయోగ కరంగా మార్చుకోవడం ఈ మధ్య ట్రెండ్‌గా మారిన సంగతి తెలిసిందే. నితిన్, అల్లు అర్జున్ సినిమాల్లో ఇప్పటికే ఇలాంటి ప్రయోగాలు చేయగా...తాజాగా రామ్ చరణ్ కూడా తన బాబాయ్ పేరును 'ఎవడు' సినిమా కోసం వాడుకుంటున్నాడు.
'ఎవడు' చిత్రంలో పవన్ కళ్యాన్ పేరు ఉపయోగించి చెప్పి ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయింది. రామ్ చరణ్, శృతి హాసన్ మధ్య జరిగే సీన్లో ఈ డైలాగ్ వస్తుంది. శృతి హాసన్...'నువ్వు పవన్ కళ్యాణ్‌లా ఫైట్ చేస్తే నిన్ను ప్రేమిస్తా' అని చెబుతుంది. అప్పుడు రామ్ చరణ్..'అయితే నన్ను మర్చిపో అమ్మా...వోల్ ఇండస్ట్రీలో అంత సీన్ ఎవడికీ లేదు' అని కౌంటర్ ఇస్తాడు.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న 'ఎవడు' లో రామ్ చరణ్ సరసన శ్రుతిహాసన్, అమీజాక్సన్ హీరోయిన్స్ . అల్లు అర్జున్, కాజల్ ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్రం కాన్సెప్టు ఏమిటంటే... మంచికీ చెడుకీ, న్యాయానికీ అన్యాయానికీ యుద్ధం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అధిపత్యం చేతులు మారినా... చివరికి విజయం మంచి వైపే ఉంటుంది. అయితే ధర్మం వైపు నిలబడి పోరాడేవాడు కావాలి. ఏ సమరమైనా ఒక్కడే మొదలుపెడతాడు. ఆ తరవాత సమూహం అతని వెంట నడుస్తుంది. మరి ఆ ఒక్కడు ఎవడు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ విషయాలు తెలియాలంటే 'ఎవడు' చూడాల్సిందే అని అంటున్నారు.
బన్నీ కనిపించేది తక్కువ సేపే అయినా ఆయన క్యారెక్టర్ సినిమాను మలుపు తిప్పుతుందట. ప్రముఖ నిర్మాత 'దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్‌పై ఈచిత్రాన్ని నిర్మస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో పీటర్‌హెయిన్స్ ఆధ్వర్యంలో ఫైట్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. సహనిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్; సంగీతం: దేవిశ్రీప్రసాద్.


Click it and Unblock the Notifications











