పవన్ డైలాగులు...చిరంజీవికి పంచ్ ఇస్తాయా?
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటించిన 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంలో పూరి జగన్నాథ్ రాసిన డైలాగులు పవర్ ఫుల్ గా పేలుతున్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ చూస్తే ఈ చిత్రంలో రాజకీయ నాయకులను ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు రాంబాబు(పవన్) టార్గెట్ చేసినట్లు స్పష్టం అవుతోంది.
ఉంచుకోవడానికి, ఉయ్యాలూగడానికి మీడియా ఉంపుడు గత్తె కాదు అనే డైలాగ్ అయితే కేక పుట్టిస్తోంది. ఈ డైలాగ్ మీడియాను గుప్పిట్లో పెట్టుకున్న రాజకీయ నాయకులను ఉద్దేశించి రాసినవే. అదే విధంగా ఈ చిత్రంలో 'ఒక్క మాటపై ఉండాలి...ఎవరికి తలవంచొద్దు' అనే డైలాగ్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజంగా అలాంటి డైలాగే ఉంటే చిరంజీవికి పవన్ కళ్యాణ్ ద్వారా పంచ్ ఖాయమని అంటున్నారు.
అదే విధంగా ఇటీవల విశాఖలో ఆర్చరీ పోటీల ప్రారంభోత్సవంలో రామ్ చరణ్ 'గెలిచినా ఓడినా పోరాడాలి' అనే వ్యాఖ్య చేసారు. చరణ్ చేసిన ఆ వ్యాఖ్యను విన్న చాలా మంది....ఈ విషయం మీనాన్నకు చెప్పు అని సెటైర్లు వేస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన కొత్తలో చిరంజీవి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసి, 2009 ఎన్నికల్లో అంచనాలను అందుకోలేక, పార్టీని నడిపే సత్తా లేక చివరకు విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీలోనే విలీనం అయిన సంగతి తెలిసిందే.
కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా నటిస్తున్నారు. అన్యాయాలను ఎదురించే ధైర్యంగల రిపోర్టర్‌గా పవన్ కనిపించనున్నాడు. పవన్ కళ్యాణ్ కి జంటగా హీరోయిన్ తమన్నా ఇందులో కెమెరామెన్ పాత్ర చేస్తోంది. ఈ చిత్రంలో పవన్ తనయుడు అకీరా నందన్ కూడా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇందులో అకీరా తండ్రితో కలిసి ఓ సాంగులో స్టెప్పులు వేసాడని సమాచారం.
ప్రకాష్ రాజ్, గ్యాబ్రియల్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఆలీ, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మ ణ్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: మణిశర్మ, నిర్మాణం: యూ నివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డి.వి.వి. దానయ్య, కథ-స్క్రీన్‌ప్లే- మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాధ్.


Click it and Unblock the Notifications











