twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ సినిమా ఆగిపోయిందనే వార్తలపై నిర్మాత వివరణ

    By Srikanya
    |

    హైదరాబాద్: పవన్, డాలీ కాంబినేషన్ లో రూపొందబోయే చిత్రం ఆగిపోయిందంటూ వార్తలు అంతటా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయమై నిర్మాత శరద్ మరార్ క్లారిటీ ఇచ్చారు. ఓ లీడింగ్ ఇంగ్లీష్ డైలీ తో మాట్లాడుతూ..అలాంటిదేమీ లేదని అన్నారు. అవి కేవలం రూమర్స్ అని కొట్టిపారేసారు.

    శరద్ మరార్ మాట్లాడుతూ... "ఆ వార్తలన్నీ నిరాధారమే, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది " అని తేల్చి చెప్పారు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం..., "స్టోరీ సిట్టింగ్స్ జరుగుతన్నాయి, పవన్, డాలీ, నిర్మాత శరద్ మరార్ ముగ్గురూ డిస్కషన్స్ లో పాల్గొంటున్నారు. ఒక నెల లోగానే సినిమా సెట్స్ కు వెళ్లనుంది. " అన్నారు.

    ఇక చాలా రోజులు క్రితమే తమిళ దర్శకుడు ఎస్ జె సూర్య దర్శకత్వంలో ఓ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు పవన్. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో పవన్ సన్నిహితుడు శరత్ మరార్, ఈ సినిమాను భారీగా తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. అయితే అనుకోకుండా సూర్య నటుడిగా బిజీగా కావటంతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.ఎస్ జె సూర్య బదులుగా గోపాల గోపాల ఫేం డాలీ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్లాలని భావించాడు పవన్.

    Pawan-Dolly movie NOT shelved!

    అయితే సూర్య ప్రీ ప్రొడక్షన్ పనులు మధ్యలోనే ఆపేయటంతో డాలీ మొదటినుంచి కొత్తగా స్క్రిప్ట్ మీద వర్క్ చేయటం మొదలు పెట్టాడట. దీంతో సినిమా సెట్స్ మీదకు వెళ్లటానికి మరింత సమయం పట్టేలా ఉంది.

    కానీ ఇప్పటికే పవన్ డిసెంబర్ నుంచి త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు డేట్స్ ఇచ్చాడు. అంటే మరో 5 నెలల్లోనే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్ పనులను పూర్తి చేయాలి. కానీ పవన్ కళ్యాణ్, డాలీల వర్కింగ్ స్టైల్ తెలిసిన వాళ్లు మాత్రం ఇంత తక్కువ టైంలో సినిమా పూర్తవ్వటం అసాధ్యం అని ఫీల్ అవుతున్నారని వార్తలు రావటంతో ఇలా క్లారిటీ ఇచ్చారు.

    English summary
    Refuting rumours that Pawan- Dolly film has been shelved, producer Sharrath Marar said there was truth" in the news.The film is expected to go on floors next month
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X